రైతు బంధు ఎగ్గొట్టడానికే పత్తి పంట డ్రామాలు

రైతు బంధు ఎగ్గొట్టడానికే పత్తి పంట డ్రామాలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పాలసీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పిన వ్య‌వ‌సాయ విధానాన్ని తొలుత గ్రామాల‌లోని గ్రామ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం ప్రజలు ఆమోదం తెలిపితేనే అమలు చేయాలన్నారు.

కేవలం రైతుల రైతుబందు ఎగ్గొట్టడానికే కేసీఆర్ ఈ విధానాన్నిప్రవేశపెట్టాడ‌ని అన్నారు రేవంత్. రైతు పండించే పంటలకు ముందుగా ఎక్కువ ధర నిర్ణయిస్తే వారే ఆ పంటలు పండించుకుంటారని అన్నారు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు పత్తి పంట కారణమ‌ని శాసన సభలో మాట్లాడిన ఆయన ఇప్పుడు పత్తి పంట ఎక్కువ పండిచాలని అనడం విడ్డూరంగా ఉంద‌‌ని అన్నారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తే కేవలం లాభపడేది పత్తి విత్తనాలు అమ్మేవాళ్లేన‌ని అన్నారు. కేవలం రైతు బంధు ఎగ్గొట్టడానికే ఈ డ్రామాలన్ని ఆడుతున్నార‌న్నారు.

ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, ఈనాడు కష్టపడ్డ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ అదుకుంటుందని అన్నారు రేవంత్.

MP Revanth Reddy comments over kcr's new agricultural policy and rythu bandhu