‘డాన్‌‌’తో ఇందిరా గాంధీ భేటీలు

‘డాన్‌‌’తో ఇందిరా గాంధీ భేటీలు

శివసేన ఎంపీ ఆరోపణ.. కాంగ్రెస్‌‌ మండిపడడంతో సారీ!

ముంబై, పుణే: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తాను చేసిన కామెంట్స్​ను వెనక్కి తీసుకుంటున్నట్లు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ గురువారం చెప్పారు. ఇందిరను కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని, తన కామెంట్స్​వల్ల ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలంటూ పేర్కొన్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్​ విమర్శల నేపథ్యంలో గురువారం​ మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో కొందరు ఇందిరాగాంధీని అవమానించేలా మాట్లాడారు. అప్పుడు కాంగ్రెస్​ నేతలు కూడా సైలెంట్​గనే ఉన్నరు. కానీ నేను ఊరుకోలేదు. ఇందిర తరఫున మాట్లాడాను. అలాంటిది ఇప్పుడు నేనే ఆమెను కించపరుస్తానా?’ అని సంజయ్ ప్రశ్నించారు. ముంబై అండర్ వరల్డ్​డాన్​ కరీంలాలాను ఇందిర కలుసుకునే వారని సంజయ్​ రౌత్​ చేసిన కామెంట్స్​పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజయ్​ తీరును కాంగ్రెస్​ పార్టీ తప్పుబట్టింది. ఇందిరపై అనుచిత వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించింది. దీనిపై సంజయ్​రౌత్​ స్పందిస్తూ.. పఠాన్​ కమ్యూనిటీ లీడర్ అయిన కరీం లాలాను ఎంతోమంది నేతలు కలుసుకునేవారని, అందులో ఇందిర కూడా ఉన్నారని చెప్పారు.

సంజయ్​ ఏమన్నరంటే..

‘అండర్​వరల్డ్​ డాన్​ హాజీ మస్తాన్‌‌‌‌ సెక్రటేరియెట్​కు వస్తే ఆయనను కలుసుకునేందుకు నేతలు, అధికారులు కిందికి దిగివచ్చేవారు. మరో డాన్‌‌‌‌ కరీంలాలానుఇందిరా గాంధీ దక్షిణ ముంబైలో కలుసుకునే వారు. ముంబై మున్సిపల్​ కమిషనర్​గా ఎవరుండాలనేది అండర్​ వరల్డ్​లీడర్లే నిర్ణయించేవారు’ అని సంజయ్​ రౌత్​ చెప్పారు. ఇందిరా గాంధీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్​ చేశారు. కాంగ్రెస్‌‌‌‌కు అండర్ ​వరల్డ్​ఆర్థిక సాయం చేసిందేమోనని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్​ అనుమానం వ్యక్తంచేశారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి