దాడి చేసిన ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టాలె

దాడి చేసిన ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టాలె

చెన్నూరులో బీజేపీ నేతలపై టీఆర్ఎస్  స్థానిక ఎమ్మెల్యే అనుచరుల దాడిని ఎంపీ సోయం బాపూరావు ఖండించారు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ను ఆయన పరామర్శించారు. దాడులకు పాల్పడుతున్న  బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేనా లేక గూండానా అని బాపూరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ బీజేపీ నాయకుల్ని తరమండి, చంపండి అని టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టడం పద్దతి కాదని అన్నారు. రైతులను పరామర్శిస్తున్న సమయంలో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం బాల్క సుమన్ ఓటమి భయానికి నిదర్శనమని బాపూరావు అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకులపై దాడి చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

కొనుగోళ్లు ప్రారంభించాలని హైవేపై రైతుల ధర్నా

భగీరథ నీటిలో రొయ్యపిల్ల