పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు : ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్

పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు : ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్
  • జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్ 

జహీరాబాద్, వెలుగు: పార్టీలకతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ అన్నారు.  గురువారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి కొంతమంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలను అందజేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జహీరాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు  మంజూరు చేశామని జహీరాబాద్ పట్టణానికి ఇంకో రెండు వేల ఇండ్లు మంజూరు చేసేందుకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. జహీరాబాద్ సమీపంలోని కోతి కే లో  నిర్మించిన 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను 524 మంది లబ్ధిదారులకు తాళాలు ఇస్తున్నట్లు చెప్పారు. 

మిగిలిన 134 డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారులపై  పై ఫిర్యాదు రావడంతో విచారణ చేసి వారం రోజుల్లో అందజేస్తామన్నారు. అధికారులు ఎమ్మెల్యే స్థాయిని కూడా చూడకుండా తనను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.