ఎంపీపీ డబ్బులు తీసుకుని మోసం చేశాడు

ఎంపీపీ డబ్బులు తీసుకుని మోసం చేశాడు

బోథ్​, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోథ్​ ఎంపీపీ తుల శ్రీనివాస్​ తనకు పనులు ఇప్పిస్తానని ఆశ చూపి డబ్బులు తీసుకొని ముంచాడని అదే పార్టీకి చెందిన వైఎస్​ఎంపీపీ రాథోడ్​ లింబాజీ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  

ఎంపీపీ తుల శ్రీనివాస్​ తన వద్ద  డబ్బులు తీసుకొని మోసం చేశాడని లింబాజీ ఆరోపించారు.  డబ్బులు ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు.   ఈ విషయాన్ని ఆయన వీడియో తీసి వాట్సప్​ గ్రూపుల్లో పోస్ట్​ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.