మంచిర్యాల: బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించి ఎంతో మంది మహిళల్ని కాపాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా కన్నెపల్లి మండల కేంద్రంలో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహలను ఎంపీ వంశీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే నేటితరం ఉపాధ్యాయులు, మహిళలకు ఆదర్శమన్నారు. ఎంతో మంది మహిళల్ని విద్యావంతుల్ని చేసి చదువు ప్రాముఖ్యత తెలియజేసిన ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
Also Read : జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తాం
తెలంగాణలో మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించేందుకు పార్లమెంట్లో కొట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గంలో రూ.5 కోట్ల వరకు పనులు శాంక్షన్ అయ్యాయని.. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మంచిర్యాలకు వందే భారత్ ట్రైన్ తీసుకొచ్చామని.. రైల్వే శాఖకి కూడా మంచి ఆదాయం వస్తుందన్నారు. వందేభారత్ ట్రైన్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
