దశల వారీగా ‘ఇందిరమ్మ’ బిల్లులు : ఎంపీడీవో సాజిత్అలీ

దశల వారీగా ‘ఇందిరమ్మ’ బిల్లులు : ఎంపీడీవో సాజిత్అలీ

 తాడ్వాయి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల దశవారీగా లబ్ధిదారులకు బిల్లులు జమవుతున్నాయని ఎంపీడీవో సాజిత్​అలీ అన్నారు.  శుక్రవారం మండలంలోని కనకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఐకేపీ ద్వారా రూ.లక్ష రుణం తీసుకోవచ్చన్నారు. ఇండ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని, లేదంటే ఇండ్ల మంజూరు రద్దవుతుందని తెలిపారు.  కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.