దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలి : మంద కృష్ణ

 దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలి : మంద కృష్ణ

నిర్మల్, వెలుగు: దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్​లోని ఆర్కే కన్వెన్షన్ హాల్​లో నిర్వహించిన వికలాంగులు, చేయూత పెన్షన్​దారుల సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు.

 హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో ఆగస్టు13న నిర్వహించనున్న దివ్యాంగుల మహా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీఎస్ పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ రాజ్, జిల్లా ఇన్​చార్జి నాగభూషణ్, నాయకులు సాగర్, బొబ్బిలి శీను, కల్లెడ సాయి, సాయి చంద్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.