Prabhas-Mrunal Thakur: హను ఆర్మీ ప్రేమ కథలో..ప్రభాస్‌, మృణాల్‌!

Prabhas-Mrunal Thakur: హను ఆర్మీ ప్రేమ కథలో..ప్రభాస్‌, మృణాల్‌!

డైరెక్టర్ హనురాఘవపుడి (Hanuraghavapudi) బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను..రీసెంట్ సీతారామం వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో హను రాఘవపూడి అదిరిపోయే కాన్సెప్ట్ను రెడీ చేశారని సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో హీరోయిన్గా సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ను ఎంపిక చేశారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఆరడుగుల అందాగాడైన ప్రభాస్ తో..ఈ అందాల బ్యూటీ నటించడం ఇది ఫస్ట్ టైం కాగా..ప్రభాస్ తో నటించడానికి మరి ఉత్సహంగా ఉందంట హను సీత. ఈ మెస్మరైజింగ్ కాంబినేషన్ సెట్ అయితే ఫ్యాన్స్ కు పండుగనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మృణాల్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. 

హను..ప్రభాస్ స్టోరీ విషయానికి వస్తే..

ఈ స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్..ఎమోషన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. దిల్రాజు బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఈ మూవీకి సంబంధించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ హను ఫ్యాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 
 
హను రాఘవపూడి..సీతారామం మూవీని ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన దుల్కర్.. మృణాల్ ఠాకూర్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో మృణాల్ వరుస ఆఫర్స్తో బిజీ హీరోయిన్ గా మారింది. ఇక ప్రభాస్ తో  చేయబోయే ఈ చిత్రం ఎలాంటి కాన్సెప్ట్స్ తో రానుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

ప్రసెంట్ ప్రభాస్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తో కల్కి, ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2,  ఇక మరోపక్క మారుతి, సందీప్ వంగా మూవీస్ను లైన్ లో పెట్టేశారు. ఇక హను రాఘవపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో హను రాఘవపూడి వెయిట్ చేస్తాడో..లేక అంతలోపు వేరే మూవీని డైరెక్ట్ చేస్తాడో చూడాలి మరి.