MS Dhoni: క్రికెట్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 'తలా' మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇండియన్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. గతంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) శిక్షణ కేంద్రానికి వెళ్లినప్పటి ఒక పాత వీడియో ప్రస్తుతం 'ఎక్స్' (ట్విట్టర్)లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో NSG కమాండోలతో ధోని చేసిన సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కమాండోల ముందే ధోని కామెడీ:
బ్లాక్ టీ-షర్ట్, డెనిమ్ జీన్స్‌తో చాలా క్యాజువల్‌గా కనిపించిన ఎంఎస్ ధోని.. ఎన్ఎస్జీ కమాండోల కఠినమైన శిక్షణ, ప్రపంచ స్థాయి ఫిట్నెస్ లెవెల్స్ గురించి అడుగుతూ వారితో ముచ్చటించారు. అలా మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా ధోని తన వైపు వేలు చూపిస్తూ.. అసలు నేను ఫిట్‌గా ఉన్నానా? అంటూ చాలా వినయంగా, ఫన్నీగా ప్రశ్నించారు. క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరైన ధోని నోట ఆ మాట వినగానే.. అక్కడ ఉన్న సాయుధ కమాండోలంతా ఒక్కసారిగా నవ్వేశారు. ధోనికి ఉన్న డౌన్-టు-ఎర్త్ స్వభావానికి ఈ వీడియోనే నిదర్శనమంటూ నెట్టింట ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
ఇండియన్ ఆర్మీతో ధోనికి ప్రత్యేక అనుబంధం:
ఎంఎస్ ధోనికి భారత సాయుధ దళాలన్నా, దేశభక్తన్నా ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. 2011లో భారత సైన్యం ధోనికి టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌లో 'గౌరవ లెఫ్టినెంట్ కల్నల్' హోదాను ఇచ్చింది. కేవలం పేరుకే కాకుండా ధోని ఆర్మీ ట్రైనింగ్ మాడ్యూల్స్ పూర్తి చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో సైనికులతో కలిసి స్వయంగా గార్డ్ డ్యూటీ, పెట్రోలింగ్ కూడా నిర్వహించి సైన్యంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
CSK తుది జట్టులోకి ధోని?:
ఈ వైరల్ వీడియో ఒకవైపు సందడి చేస్తుంటే.. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఆడతారా లేదా? అనే ఉత్కంఠ అభిమానుల్లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుత టోర్నమెంట్లో ఆయన ఎప్పుడు బరిలోకి దిగుతారనే దానిపై సీఎస్కే (CSK) యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ రానప్పటికీ.. తమ అభిమాన ఆటగాడు మళ్లీ పసుపు జెర్సీ (Yellow Jersey) ధరించి మైదానంలో హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడతాడని ధోనీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
MS Dhoni having a conversation with NSG Commandos,
— DHONI Trends™ (@TrendsDhoni) May 17, 2026
"Am I looking fit?" 😂❤️ pic.twitter.com/WeMwTOjZgh
