ధోని నుండి ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ అందుకున్న నితిన్

ధోని నుండి ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ అందుకున్న నితిన్

యూత్ హీరో నితిన్(Nithin) చేస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రార్డీనరీ(Extra-Ordinary). టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వక్కంతం వంశీ(Vakkantham Vamshi) తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ సంగీతమే అందిస్తున్నారు. తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎక్స్‌ట్రార్డీనరీ హీరో నితిన్ ఇండియాస్ ఎక్స్‌ట్రార్డీనరీ క్రికెట్ ప్లేయర్ ధోని నుండి అదిరిపోయే గిఫ్ట్ అందుకున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇందులో భాగంగా అయన తన సోషల్ మీడియాలో ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ ఫ్రమ్ ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్.. థాంక్ యూ ఎంఎస్ ధోని.. లవ్ యూ.. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ ట్రెండ్ అవుతోంది.