టెన్త్​ పాసైతే​ చాలు​.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

టెన్త్​ పాసైతే​ చాలు​.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

పది పాసవడంతోనే సెంట్రల్​ కొలువు సొంతం చేసుకునే అద్భుత అవకాశం స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్ ​ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎస్​ఎస్​సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్​ నోటిఫికేషన్‍2020 రిలీజ్​ చేసింది. గ్రూప్-సి, నాన్‍గెజిటెడ్‍, నాన్మి నిస్టీరియల్​ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్​ జాబ్​కు సెలెక్ట్​ అయితే స్టార్టింగ్​లోనే రూ. 20 వేలకు పైగా శాలరీ తీసుకోవచ్చు. ఎంటీఎస్​ నోటిఫికేషన్​, సెలెక్షన్​ ప్రాసెస్​ ఈ వారం..

సర్కారు కొలువు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఎంటీఎస్​ నోటిఫికేషన్​ మంచి చాన్స్​​. పక్కా ప్లాన్​తో మూడు నెలలు కష్టపడితే ఫస్ట్​ అటెంప్ట్​లో జాబ్​ కొట్టొచ్చు.  వివిధ శాఖల్లో దాదాపు 10 వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. ఎంటీఎస్​ ఎగ్జామ్‍ టెన్త్​ అర్హతతో నిర్వహించే పరీక్షే అయినప్పటికీ పీజీ, పీహెచ్‍డీలు చేసిన వారు కూడా పోటీ పడతారు. కాంపిటీషన్​ హెవీగానే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్​ అందుకు తగినట్లుగానే ప్లాన్​ చేసుకోవాలి. ప్రశ్నలన్నీ టెన్త్​, ఇంటర్‍స్థాయిలోనే ఉంటాయి. పరీక్షకు దాదాపు 90 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఒక్కో సబ్జెక్టుకు 20 రోజుల చొప్పున కేటాయించుకొని ప్రిపరేషన్​ సాగిస్తూ..  చివరి 10 రోజుల్లో రివిజన్‍చేస్తే ఫలితముంటుంది.

శాలరీస్​ & డ్యూటీస్​

పనిచేసే ప్రదేశాన్ని బట్టి ఎంటీఎస్‍ అభ్యర్థులు ప్రారంభంలోనే నెలకు రూ.18,500 నుంచి రూ. 22, 500 వేతనం పొందుతారు. మూడేళ్ల కాలంలోనే మొదటి ప్రమోషన్‍తీసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు ఆధారంగా ఐదేళ్లలోనే మూడు నుంచి నాలుగు  ప్రమోషన్లు పొందవచ్చు. వీరికి సాధారణంగా ప్యూన్‍, డఫాట్రీ, జామ్‍దార్‍, ఫరాస్‍, చౌకీదార్‍, సఫాయివాలా, మాలి, జూనియర్​ ఆపరేటర్ వంటి జాబ్‍ప్రొఫైల్స్ కేటాయిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్

రాత పరీక్షలో ఆబ్జెక్టివ్​ అండ్​ డిస్ర్కిప్టివ్‍ రెండు పేపర్లుంటాయి. ఆన్‍లైన్‍లో నిర్వహించే ఆబ్జెక్టివ్‍పేపర్‍లో నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 90 నిమిషాలు. నెగెటివ్‍మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు మైనస్‍అవుతుంది. పేపర్‍I లో  క్వాలిఫై అయిన వారికి మాత్రమే రెండో దశలో వ్యాసరూప సమాధాన పరీక్ష (డిస్ర్కిప్టివ్‍టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే, లెటర్​ ఇన్​ ఇంగ్లిష్​ టాపిక్స్​ మీద ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 50. సమయం 30 నిమిషాలు. ఇంగ్లిష్, హిందీ లేదా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‍లో పేర్కొన్న ఏదైనా ప్రాంతీయ భాషలో ఆన్సర్​ రాయవచ్చు. అక్షర దోషాలు, పంక్చుయేషన్​ మా ర్క్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పేపర్‍I మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా తయారు చేస్తారు. వివిధ షిప్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే పేపర్‍-II లో వచ్చిన మార్కులను చూస్తారు.

సిలబస్‍& ప్రిపరేషన్​ టిప్స్

ఇంగ్లిష్​ లాంగ్వేజ్‍

ప్రాథమికంగా ఇంగ్లిష్​ భాషపై అభ్యర్థికి గల అవగాహనను పరీక్షించేలా ఇందులో ప్రశ్నలిస్తారు. వొకాబులరీ, గ్రామర్‍, సెంటెన్స్ స్ర్టక్చర్‍, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వాటి ఉపయోగం మరియు రాత నైపుణ్యం (రైటింగ్‍ఎబిలిటీ) టెస్ట్ చేస్తారు. ఇందుకుగాను ప్రీవియస్‍పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఏదైనా స్టాండార్డ్ బుక్‍ఇంటర్నెట్‍లో లభించే ఆంటోనిమ్స్, సిననిమ్స్ లిస్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది.

జనరల్​ ఇంటెలిజెన్స్ & రీజనింగ్‍

ఈ విభాగంలో ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన విధులపై నాలెడ్జ్ టెస్ట్ చేసేలా నాన్‍వర్బల్‍రీజనింగ్‍నుంచి ప్రశ్నలు అడుగుతారు. సిమిలారిటీస్​ అండ్​ డిఫరెన్సెస్‍, స్పేస్​ విజువలైజేషన్‍, ప్రాబ్లం సాల్వింగ్‍, అనాలసిస్‍, జడ్జిమెంట్‍, డెసిషన్‍మేకింగ్‍, విజువల్‍మెమొరీ, డిస్ర్కిమినేటింగ్​ అబ్జర్వేషన్, రిలేషన్‍షిప్స్ కాన్సెప్ట్స్, ఫిగర్‍క్లాసిఫికేషన్‍,  అర్థమెటిక్​ నంబర్‍సిరీస్‍, నాన్‍వర్బల్‍సిరీస్‍వంటి టాపిక్‍లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థి ఆలోచనలు, సింబల్స్, వాటిని గుర్తించడం, అర్థమెటికల్​ కంప్యూటేషన్ వంటి అంశాలను పరీక్షిస్తారు.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్‍

నంబర్‍సిస్టమ్స్, వోల్‍నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్‍ అర్థమెటిక్​  ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్‍లు, మెన్సురేషన్, కాలం–-దూరం, నిష్పత్తి- కాలం, కాలం- పని వంటి టాపిక్‍ల నుంచి ప్రశ్నలిస్తారు. సిలబస్‍లో ఉన్న టాపిక్‍లను బాగా ప్రాక్టీస్‍చేయాలి. ప్రీవియస్‍పేపర్లపై  అవగాహన ఉంటే  ప్రిపరేషన్ సులువవుతుంది.

జనరల్​ అవేర్‍నెస్‍

జనరల్​ అవేర్‍నెస్​ విభాగం చాలా విస్తృతమైనది. కరెంట్‍అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్‍ నాలెడ్జ్‌‌లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు,  వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. చరిత్రలో బ్రిటిషు పాలన, స్వాతంత్ర్య పోరాటం, బ్రిటిషు గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర్య సమరయోధుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్‍పాలిటీలో రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు చదువుకోవాలి.  ఎన్‌‌సీఈఆర్‌‌టీ 8, 9, పదోతరగతి పుస్తకాలను చదవాలి.

–వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్

For More News..

ఐపీఎల్‌ ఆక్షన్‌కు 1097 మంది ప్లేయర్లు