మిడిల్ ఈస్టర్న్ కంపెనీస్ తో రిలయన్స్ చర్చలు

మిడిల్ ఈస్టర్న్ కంపెనీస్ తో రిలయన్స్ చర్చలు

న్యూఢిల్లీ: జియో ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులకు సంబంధించి మూడు అతి పెద్ద మిడిల్ ఈస్టర్న్ సావెరిన్ వెల్త్ ఫండ్స్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వ్యాపారంలో బాగా విస్తరించిన సదరు ఇన్వెస్టర్స్ తో సంబంధాలు తమ బిజినెస్ కు చాలా హెల్ప్ అవుతాయని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలిసింది. అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్ మెంట్ కో డాట్ రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ లో సుమారుగా 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుందని.. ఈ వారంలోనే సంబంధిత ప్రకటన రావొచ్చని సమాచారం. అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ తోపాటు సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో కూడా రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు తగ్గించాలనే ముఖేశ్ అంబానీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థల పెట్టుబడులు చాలా హెల్ప్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. జియో వ్యాల్యుయేషన్ ను నిర్ణయించడంలో కూడా ఇది సాయపడుతుందని విశ్లేషిస్తున్నారు. జియో ఇటీవల సేకరించిన 10 బిలియన్ డాలర్ల్ ఇన్వెస్ట్ మెంట్ కు ఏదైనా కొత్త పెట్టుబడి చేరితే అది రిలయన్స్ కు దోహదపడే అవకాశాలు ఉన్నాయి. ఫేస్ బుక్ నుంచి కేకేఆర్ లాంటి ప్రముఖ కంపెనీలన్నీ జియోలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో ఎడ్యుకేషన్ నుంచి పేమెంట్స్ వరకు అన్ని ట్రెడిషన్ ఇండస్ట్రీస్ ను తన టెక్నాలజీతో షేక్ చేయాలని జియో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.