ములకలపల్లి, వెలుగు: ములకలపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్, కాలేజీ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సునీత మంగళవారం తెలిపారు.
పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొడ్ల అంజుశ్రీ సబ్ జూనియర్స్ విభాగం కబడ్డీ పోటీలకు ఎంపికై జాతీయ స్థాయిలో ఈనెల 27 నుంచి 30 వరకు హర్యానాలో నిర్వహించే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొననున్నారు.
పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పి.అక్విల సాయి శ్రీ కోకో అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల 22 నుంచి 25 వరకు రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో పాఠశాల నుంచి అక్విల సాయి శ్రీ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
పాఠశాలకు చెందిన ఇరువురు విద్యార్థినిలు క్రీడా పోటీల్లో పాల్గొని జాతీయ,రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్,పాఠశాల పిడి, పి టి లు విద్యార్థినులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
