ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులకు బోనస్ పంపిణీ : ఎ.ప్రవీణ్రెడ్డి

ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులకు బోనస్ పంపిణీ : ఎ.ప్రవీణ్రెడ్డి

భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూర్​ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులకు ఈ ఏడాది రూ.15.47 కోట్ల బోనస్​ పంపిణీ చేయనున్నట్లు ముల్కనూర్​ సొసైటీ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్​రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లో స్వకృషి డెయిరీ 23వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా మహాసభ నివేదిక చదివి వినిపించారు. అనంతరం ప్రవీణ్​రెడ్డి మాట్లాడుతూ ముల్కనూర్​ స్వకృషి మహిళా డెయిరీ ప్రస్తుతం 203 గ్రామాల్లో 23వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుండటం అభినందనీయమన్నారు. అనంతరం డెయిరీ జీఎం భాస్కర్​ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది రూ.180 కోట్ల వ్యాపారం నిర్వహించి , రూ.19 కోట్ల మేర లాభాలు పొందినట్లు చెప్పారు.

 ఈ సందర్భంగా జీలుగుల నుంచి మేడుదల సునిత, గోపాల్​పూర్​ 2 నుంచి గుజ్జ రమాదేవి, అక్కన్నపేట నుంచి కాశబోయిన లావణ్యను కొత్త డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. ఉత్తమ సంఘాలుగా వంగర, భీమదేవరపల్లి, ముత్తారం తండా, ఉల్లంపల్లి, ఇందిరానగర్​గ్రామాలు ఎంపికయ్యాయి. ఉత్తమ సభ్యులైన అలుగు రజిత, బత్తుల వాణి, గుజ్జ అరుణ, గుజ్జేటి సరితను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్​ బి.నాగరాజు, కెనరా బ్యాంక్​ మేనేజర్​ సాయి చరణ్, పాలకవర్గ సభ్యులు డి.రజిత, రాజేశ్వరి, సులోచన, శోభారాణి, రమాదేవి, కవిత, అరుణ, సుజాత, రజిత తదితరులు పాల్గొన్నారు.