
ములుగు, వెలుగు: కాంగ్రెస పార్టీ ఎన్నికల వేళ ఇచ్చి నెరవేర్చని హామీలను ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్బడే నాగజ్యోతి అన్నారు. ఆదివారం ములుగులో పార్టీ జిల్లా ఆఫీస్‌లో మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ హామీల కార్డును గడపగడపకూ తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పోరిక గోవింద్ నాయక్, పోమా నాయక్, సకినాల భవానీ, అజ్మీర ధరమ్‌సింగ్, ములుగు పట్టణాధ్యక్షుడు చెన్న విజయ్ తదితరులు పాల్గొన్నారు.