ములుగును అడవుల జిల్లాగా తీర్చిదిద్దుదాం..పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తాం..

ములుగును అడవుల జిల్లాగా తీర్చిదిద్దుదాం..పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తాం..
  •  మరిన్ని చెట్లు నాటుదాం: మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ములుగును అడవుల జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క తెలిపారు.  శుక్రవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎకో పార్కులో కలెక్టర్​ దివాకర టీఎస్, ఆర్పీఎఫ్​ 39వ బెటాలియన్​ కమాండెంట్​ ప్రశాంత్​ కుమార్, టీజీఎస్పీ 5వ బెటాలియన్​ కమాండెంట్  సుబ్రహ్మణ్యం, డీఎఫ్​వో రాహుల్ కిషన్​ జాదవ్, లైబ్రరీ చైర్మన్​ బానోత్​ రవిచందర్​తో కలిసి మొక్కలు నాటారు. 

గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నుంచి సాగునీటిని పంట కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని, జిల్లాలోని అడవులను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

రైతులకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రామప్ప నుంచి లక్నవరం సరస్సు వరకు  కెనాల్​ నిర్మించి రెండు పంటలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ఇరిగేషన్  ఈఈ నారాయణ, అధికారులు పాల్గొన్నారు.