మహబూబాబాద్ జిల్లా; తాను చెప్పిన పంటలు వేసినవారికే రైతు బంధు ఫధకం వర్తింపు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.మహబూబాబాద్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. .రైతులు సాగుచేసుకుంటన్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, మొక్కజొన్న రైతులు కు గిట్టుబాటు ధర కల్పించాలని ఆమె అన్నారు.
అధికార పార్టీకి కొమ్ము కాయద్దు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వున్నా ఏరియా హస్పిటల్ కమిటీ నియాయకమంలో అవకతవకలున్నాయన్న సీతక్క .. జిల్లా అభివృద్ధి కమిటీ లో అన్ని పార్టీలుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా అధికారులు అధికార పార్టీ కి కొమ్ము కాయద్దని చెప్పారు. రాష్ట్రం లో ప్రతిపక్షా పార్టీ ప్రతినిధులు కు ప్రోటో కాల్ లేదని ఆమె అన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఇస్తామన్న డబుల్ బెండ్ రూమ్ ఇండ్లు ఆడ్రస్ లేదని, పేదవాళ్లు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం కూల్చివేస్తుందని అన్నారు ఎమ్మెల్యే. పేదలకు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదని, వైన్ షాపుల పై ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ద….పేద ప్రజల ఆకలి పై లేదని మండిపడ్డారు. కరోనా వైరస్ నేపధ్యంలో జిల్లాలో ఉన్న గిరిజన ప్రజులకు ఒక్కొక్క ఇంటికి 5 వేలు ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. మాస్క్‌లు
కోసం ప్రభుత్వం జీవో తీసుకువచ్చారు, కానీ ఇంతవరకు మాస్క్‌లు పంపిణీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు.
