ముంబై, ఢిల్లీ వాళ్లను తొందరగా నమ్మొద్దంట

ముంబై, ఢిల్లీ వాళ్లను తొందరగా నమ్మొద్దంట

సాధారణంగా ఇప్పటి ట్రెండ్ ఫ్రెండ్స్ షిప్ చేయడంలో ఎంతో ఆసక్తి చూపుతుంది. కొత్త వారితో స్నేహం చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. మనుషలు, వారి స్వభావాలు, వారి గ్రామాలు ఇలా అడిగి మరీ స్నేహం చేస్తుంటారు.  ఇప్పుడు ఓ సర్వే సంస్థ ఫ్రెండ్లీ నగరాలు.. అన్ ఫ్రెండ్లీ నగరాల జాబితాను ప్రకటించింది.   ఆరు కీలక పాయింట్ల ఆధారంగా సర్వేచేసి నివేదిక వెల్లడించింది.  భారతదేశంలో ఏ ఒక్క నగరం కూడా ఫ్రెండ్లీ లిస్ట్ లో చేరకపోగా.. ముంబయి, ఢిల్లీ నగరాలు మాత్రం అన్ ఫ్రెండ్లీ సిటీల జాబితాలో నిలిచాయి.

కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్

ప్రపంచంలోని 53 నగరాల్లో వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్  సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది. . ఆరు కీలక కొలమానాల ఆధారంగా పలు సిటీలకు స్కోర్ కేటాయించారు. సందర్శకులు తిరిగి రావడం, భద్రతా రేటింగ్స్, LGBTQ+సమానత్వం, ఓవర్ఆల్ హ్యాపీనెస్,సాధారణభాష,సిబ్బంది స్నేహపూర్వకంగా(ఫ్రెండ్లీ స్టాఫ్) వ్యవహరించే తీరు అంశాల ఆధారంగా సర్వే నిర్వహించారు.  స్థానికేతరుల పట్ల ఆ సిటీల్లోని ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశాలపై ఈ నివేదిక వెల్లడైంది.

ముంబై, ఢిల్లీ రేటింగ్ ఎలా ఉందంటే... 

ఫ్రెండ్లీ సిటీల జాబితాలో ఒక్క భారతీయ నగరం కూడా చోటు సంపాదించుకోలేదు.  ముంబై, ఢిల్లీ నగరాల విషయానికి వస్తే.. కేవలం 12 శాతం మాత్రమే ముంబై స్నేహపూర్వకంగా ఉంటుందని భావించారు. ఢిల్లీ 17 శాతం మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. ఫ్రెండ్లీ స్టాఫ్ కేటగిరీ కింద సర్వే ప్రకారం, ముంబై 3.91% రేటింగ్‌ను సాధించగా, ఢిల్లీ 3.27% సాధించింది. హ్యాపీనెస్ స్కోర్ లో ముంబై 3.78 స్కోర్ సాధించగా, ఢిల్లీ 4.01 స్కోర్ సాధించింది. ఆఫ్రికా దేశం ఘనా రాజధాని అక్రా స్థానికేతరులతో అత్యంత తక్కవ స్నేహపూర్వక నగరంగా నిలిచింది. మొత్తం 10 పాయింట్లకు అక్రాకు కేవలం 3.12 స్కోర్ లభించింది. మెరాకోలోని మర్రకేజ్ 3.62 స్కోర్ తో రెండో స్థానంలో ఉంది. ముంబయి, కౌలాలంపూర్, రియో డి జెనీరో, ఢిల్లీలు అన్‌ఫ్రెండ్లీ జాబితాలో ఆ తర్వాత స్థానాలను ఆక్రమించాయి.

ఇవే ఫ్రెండ్లీ సిటీస్ ..

ప్రపంచంలో ఫ్రెండ్లీగా ఉండే నగరాల జాబితాలో కెనడా నగరం టొరంటో, ఆస్ట్రేలియా నగరం సిడ్నీలు స్థానికేతరులతో చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లు తేలాయి. రెండూ 10కి 7.97తో స్కోర్ సాధించాయి. ఈ రెండు కూడా ఫ్రెండ్లీ నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. ఎడిన్ బర్గ్, మాంచెస్టర్ రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. 100కి 68.92 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్‌తో 7.78 అత్యధిక స్నేహపూర్వక స్కోర్‌ సాధించింది. మాంచెస్టర్ 10కి 7.72 స్కోర్ చేసింది. స్నేహితులను ఎలా సంపాదించుకోవాలనే సెర్చ్ చేసిన నగరాల జాబితాలో బ్రెజిల్ లోని సావోపాలో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. న్యూయార్క్, పారిస్ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.