ఆకాశంలో విమానం.. ఆగిపోయిన ఇంజిన్

ఆకాశంలో విమానం.. ఆగిపోయిన ఇంజిన్

ఆకాశంలో విమానం ఎగురుతోంది. అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే ప్రయాణీకుల గుండెలు అదిరిపోతుంటాయి. ఏమి జరుగుతోందోనని టెన్షన్ టెన్షన్ పడుతుంటారు. ఈ మధ్య విమాన ప్రయాణీకులకు వరుస షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 

ఎయిర్ ఇండియా విమానం A1-639 ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఉదయం బెంగళూరుకు బయలుదేరింది. ఆకాశంలోకి ఎగిరి 27 నిమిషాల అనంతరం విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడింది. సమస్య ఎక్కడుందో గుర్తించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. టెంపరచేర్స్ అధికంగా ఉండడంతో ఇంజిన్ షట్ డౌన్ అయ్యినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు.

అత్యవసరంగా విమానాన్ని ముంబైలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ పై ఒత్తిడి పెరగడంతో ఆగిపోయినట్ల పెలెట్ గుర్తించారని వెంటనే ముంబై ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశారని ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. మరో విమానంలో ప్రయాణీకులను బెంగళూరుకు చేర్చడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం : -

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ


చింతన్ శిబిర్ తో కాంగ్రెస్ లో ఎలాంటి మార్పురాదు


ప్రధాని మోడీపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్