స్కూల్ గర్ల్ ని అడగకూడనిది అడిగి జైలుకెళ్లిన కండక్టర్

స్కూల్ గర్ల్ ని అడగకూడనిది అడిగి జైలుకెళ్లిన కండక్టర్

మైనర్ విద్యార్థిని సెక్స్ గురించి ఏమైనా తెలుసా అని అడిగినందుకు బస్సు కండక్టర్‌కు ముంబైలోని స్పెషల్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అంతేగాకుండా రూ. 15వేల జరిమానా విధించింది.  నిందితుడు బస్ కండక్టర్ చంద్రకాంత్ సుడం కోలిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద  కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే 2018 జూలైలో తూర్పు శివారు ముంబైలో 13 ఏళ్ల బాలిక ప్రతిరోజూ ఉదయం ప్రభుత్వ బస్సులో పాఠశాలకు వెళ్లేది. ఒక రోజు ఆ బాలిక బస్సు ఎక్కి వెనుక సీట్లో కిటికీ దగ్గర  కూర్చుంది. తన ఫ్రెండ్స్ వేరే సీట్లల్లో  కూర్చున్నారు. బస్సు కండక్టర్  కోలి వెనుక సీట్లో కూర్చున్న బాలిక దగ్గరకు వెళ్లాడు.  బస్ పాస్ చూపెట్టగానే వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చి అమ్మాయి పక్కన కూర్చుని సెక్స్ గురించి నీకు ఏదైనా తెలుసా అని అడిగాడు. అలాంటి ప్రశ్నలు అడగవద్దని అమ్మాయి అతనికి చెప్పింది. ఆ తరువాత కండక్టర్ కోలి ముందు సీటుకు వెళ్ళాడు. మళ్లీ కొద్దిసేపటికి వచ్చిన  కోలి మళ్ళీ అమ్మాయి వద్దకు వచ్చి అదే ప్రశ్న అడిగాడు. కానీ మళ్ళీ అమ్మాయి సమాధానం చెప్పలేదు.

బాలిక తన బస్ స్టాప్ దగ్గరికి రాగానే బస్సులోంచి దిగింది. ఈ విషయం ఆ అమ్మాయి తన ఫ్రెండ్ కు చెప్పింది.  కొన్ని రోజుల తరువాత అమ్మాయి బస్సులో స్కూల్ కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో బాధితురాలి తల్లి ఏమైంది అని నిలదీసింది. అయితే ఆ అమ్మాయి తన తల్లికి ఏమీ చెప్పలేదు. అయితే తన ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకున్న తల్లి కుమార్తెను బస్ డిపోకు తీసుకెళ్లింది. అమ్మాయి బస్ కండక్టర్ కోలిని గుర్తించింది. దీంతో తల్లి తన కూతురితో నెహ్రూ పోలీస్ స్టేషన్లో కండక్టర్ కోలిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదైన తరువాత 12రోజులకే అతను బెయిల్ పై బయటకొచ్చాడు. లేటెస్ట్ గా ఈ ఘటనపై విచారించిన  ప్రత్యేక కోర్టు బస్ కండక్టర్ కోలికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.