లైలా ఖాన్ హత్య కేసులో.. మారు తండ్రికి ఉరి శిక్ష

లైలా ఖాన్ హత్య కేసులో.. మారు తండ్రికి ఉరి శిక్ష

పద్నాలుగు ఏళ్ల క్రితం 2011 ఫిబ్రవరిలో లైలా ఖాన్‌తో పాటు ఆమె ఫ్యామిలీలో ఐదుగురిని హత్య చేసినందుకు ఆమె సవతి తండ్రికి సెషన్స్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. కాశ్మీర్లో నివసించే పర్వేజ్ తక్‌ లైలా ఖాన్ తల్లి షెలీనా మూడవ భర్త. అతను మర్డర్ కేసులో 2012లో అరెస్టయ్యాడు. లైలా ఖాన్(30), ఆమె అక్క అజ్మీనా(32), కవల తోబుట్టువులు ఇమ్రాన్ (25), కజిన్ రేష్మా మరియు తల్లి షెలీనా(51)లను హత్య చేసినందుకు పర్వేజ్ తక్ కు ఉరిశిక్ష విధించింది.

లైలా ఖాన్ తండ్రి మరియు షెలీనా మొదటి భర్త నాదిర్ పటేల్ ఆరుగురు కుటుంబ సభ్యులు తప్పిపోయారని లైలా సవతి తండ్రి ఆసిఫ్ షేక్‌(షెలీనా రెండవ భర్త)పై అనుమానంతో ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరుగురిని హత్య చేసి షెలీనా మూడవ భర్త పర్వేజ్ తక్ కాశ్మీర్ పారిపోయాడు. ఇగత్‌పురిలో చివరి సారిగా ఫ్యామిలీతో కలిసి ఉంది కూడా ఫర్వేజ్ తక్ యే. సెల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి ముంభై పోలీసులు తక్ ను కాశ్మీర్లో అరెస్ట్ చేశారు.

ఇగత్‌పురి బంగ్లాను సందర్శించినప్పుడు తక్, షెలీనా మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ అతను ఆమెను కొట్టి చంపాడు. అతనితో పాటు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తుల సహాయంతో ఇతర కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి సమీపంలోని గొయ్యిలో మృతదేహాన్ని పడేసి ఇంటికి నిప్పంటించాడు. ఈ కేసులో తక్ కు మరణశిక్ష పడింది.