సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో ముంబై విజయం

సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో ముంబై విజయం

కోల్‌‌‌‌కతా: ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన ముంబై.. తొలిసారి సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ (31 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 36), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (26 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 34) చెలరేగడంతో.. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3 వికెట్ల తేడాతో హిమాచల్‌‌ ప్రదేశ్‌‌పై గెలిచింది.

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన హిమాచల్‌‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఏకాంత్‌‌ సేన్‌‌ (37), ఆకాశ్‌‌ (25), నిఖిల్‌‌ (22) రాణించారు. ముంబై స్పిన్నర్‌‌ తానుష్‌‌ కొటేన్‌‌ (3/15), పేసర్‌‌ మోహిత్‌‌ (3/21) సూపర్‌‌ బౌలింగ్‌‌తో హిమాచల్‌‌ను కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ముంబై 19.3 ఓవర్లలో 146/7 స్కోరు చేసి నెగ్గింది. పృథ్వీ షా (11), రహానె (1) విఫలమైనా, యశస్వి జైస్వాల్‌‌ (28) ఫర్వాలేదనిపించాడు. సర్ఫరాజ్‌‌ రెండు కీలక పార్ట్‌‌నర్‌‌షిప్స్‌‌తో టీమ్‌‌ను గెలిపించాడు.  తానుష్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.