
వీధుల్లో ఇడ్లీ అమ్మే ఓ వ్యాపారి చట్నీ తయారీకి మరుగుదొడ్డిలోని నీటిని వాడాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని బొరివెలి రైల్వేస్టేషన్ సమీపంలో ఇడ్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి.. స్టేషన్ టాయిలెట్ లో తెచ్చిన నీటితో చట్నీ తయారు చేశాడు. ఇదంతా ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి ట్విటర్ లో షేర్ చేశాడు.
ఈ వీడియో ఆహార భద్రతా అధికారుల వరకూ వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు.. ఆహారం విషయంలో కలుషిత నీటిని ఉపయోగించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముంబై ఎఫ్‌డీఏ అధికారి శైలేష్ అదావ్ అన్నారు.
#हे राम! नींबू शरबत के बाद अब इडली भी गंदे पानी से !! इस वायरल वीडियो में इडली विक्रेता इडली के लिए # Borivali स्टेशन के शौचालय से गंदा पानी लेते हुए दिख रहा है #BMC #FDA ?@ndtvindia @MumbaiPolice @WesternRly pic.twitter.com/TFmRkgoMMN
— sunilkumar singh (@sunilcredible) May 31, 2019