ముంబైని ఆపతరమా! ఆరో టైటిల్​ వేటలో ఇండియన్స్​

ముంబైని ఆపతరమా! ఆరో టైటిల్​ వేటలో ఇండియన్స్​
  • ముంబైని ఆపతరమా!
  • మరో 8 రోజుల్లో ఐపీఎల్​14 

రోహిత్‌‌‌‌, బుమ్రా, పాండ్యా  బ్రదర్స్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌.. ఇలా ప్రస్తుత ఇండియా లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల టీమ్‌‌‌‌లో సగం మంది ముంబై ఇండియన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లోనే ఉన్నారు. వీళ్లకు తోడు షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌ కీరన్‌‌‌‌ పొలార్డ్‌‌‌‌, సౌతాఫ్రికా డేరింగ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌, ఆస్ట్రేలియా డేంజర్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌ స్పీడ్‌‌‌‌స్టర్‌‌‌‌ ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌లతో  ఆ టీమ్‌‌‌‌ను ఓ పర్‌‌‌‌ఫెక్ట్‌‌‌‌ టీ20 ప్యాకేజ్‌‌‌‌ అనొచ్చు. అందుకే ఇండియన్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ హిస్టరీలో ముంబై మోస్ట్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ టీమ్‌‌‌‌గా నిలిచింది. ఐపీఎల్‌‌‌‌లోనే కాదు వరల్డ్‌‌‌‌లో అన్ని లీగ్స్‌‌‌‌లోకెల్లా ముంబైనే స్ట్రాంగెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌గా భావిస్తున్నారు. ఇప్పటికే ఐదు టైటిల్స్‌‌‌‌ నెగ్గిన రోహిత్‌‌‌‌ శర్మ కెప్టెన్సీలోని ఇండియన్స్‌‌‌‌ ఆరో ట్రోఫీపై గురిపెట్టింది. శ్రీలంక లెజెండ్‌‌‌‌, కూల్‌‌‌‌ కోచ్‌‌‌‌ మహేల జయవర్ధనే మార్గనిర్దేశంలో  ప్రతీ సీజన్‌‌‌‌కు ఎంతో ఇంప్రూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ చూపిస్తున్న ఆ జట్టు..   కోర్‌‌‌‌ టీమ్‌‌‌‌ను నిలబెట్టుకుంది. కొత్తగా మరికొన్ని అస్త్రాలను జత చేసుకొని ఐపీఎల్‌‌‌‌– 14లో బరిలోకి దిగుతోంది.

ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ను ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ను విడదీసి చూడలేం. లీగ్‌‌‌‌‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ది ఘన ప్రస్థానం. తొలి ఐదు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఆ జట్టు.. తర్వాతి ఎనిమిది ఎడిషన్లలో ఏకంగా 5 ట్రోఫీ కైవసం చేసుకుంది. 2013 నుంచి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ప్రతీసారి టైటిల్‌‌‌‌‌‌‌‌తో తిరిగొచ్చింది. లీగ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు (203) ఆడి, ఎక్కువ విజయాలు (118) సాధించిన  జట్టిదే. హిట్టర్లతో కూడిన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌, డెత్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఇరగదీసే సాలిడ్‌‌‌‌‌‌‌‌ పేసర్లతో కూడిన  ఫైవ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లోనూ చాలా బలంగా కనిపిస్తోంది.   పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ కోచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌, శిక్షణ సౌకర్యాలు, అర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ముంబై టీమ్‌‌‌‌‌‌‌‌ ఎప్పట్లానే పక్కా ప్లానింగ్‌‌‌‌‌‌‌‌తో ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌ మొదలు పెట్టింది. ‘వన్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ’ అంటూ టీమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అందరి మధ్య బాండింగ్‌‌‌‌‌‌‌‌ పెంచిన  ఫ్రాంచైజీ  టైటిల్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా ముందుకెళ్తోంది.  చాన్నాళ్ల నుంచి జట్టుకు అండగా నిలిచిన ప్లేయర్లను రిటైన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ముంబై యాజమాన్యం ఆక్షన్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా పలువురు ఆటగాళ్లను తీసుకుంది.   ఆసీస్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ కూల్టర్‌‌‌‌‌‌‌‌ నైల్‌‌‌‌‌‌‌‌ (రూ. 5 కోట్లు), కివీస్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ ఆడమ్‌‌‌‌‌‌‌‌ మిల్నే( 3.2 కోట్లు), చావ్లా (2.4 కోట్లు) కోసం ఎక్కువ ఖర్చు చేసింది. క్రికెట్​ లెజెండ్​సచిన్ ​కొడుకు అర్జున్​ టెండూల్కర్​ను తీసుకున్న ఆ టీమ్  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌9న రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుతో కొత్త సీజన్‌‌‌‌‌‌‌‌ను మొదలు పెట్టనుంది.  ఆ టీమ్​ బలాబలాలు ఎలా ఉన్నాయి.. కొత్త సీజన్‌‌‌‌‌‌‌‌లో అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బలహీనతలు..
ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో స్పీడ్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో ముంబైకి సమస్య ఎదురుకావొచ్చు. ముఖ్యంగా చెన్నై  చెపాక్‌‌‌‌‌‌‌‌ స్టేడియం ట్రాక్‌‌‌‌‌‌‌‌పై ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌ ఎదురవనుంది. వికెట్‌‌‌‌‌‌‌‌ టేకింగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ అవకాశాలను దెబ్బతీయొచ్చు. ఇక, లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ క్రునాల్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేడు. మొన్నటి వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ అతని బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికేశారు. కాబట్టి మెయిన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా అతడిపై భరోసా ఉంచలేని పరిస్థితి. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తోనే వెలుగులోకి వచ్చిన రాహుల్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌పైనే కాస్త నమ్మకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ జయంత్​యాదవ్‌‌‌‌‌‌‌‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌లో రెండే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడాడు. ఈ సారి అతనికి ఎన్ని అవకాశాలు వస్తాయో చూడాలి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ ఆక్షన్‌‌‌‌‌‌‌‌లో తీసుకున్న పీయూష్‌‌‌‌‌‌‌‌ చావ్లా రూపంలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉన్నాడు. 156 వికెట్లతో లీగ్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో థర్డ్‌‌‌‌‌‌‌‌ హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ తనకు సరైన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ లేదు. టీమ్‌‌‌‌‌‌‌‌లో చాలా మంది మెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఉన్నారు కానీ ప్రతీస్లాట్‌‌‌‌‌‌‌‌కు సరైన రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ లేవు.  రిజర్వ్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ మొత్తం యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌తో నిండింది. 

అంచనా..
 మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్లేయర్లంతా హార్డ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్లే కావడం ముంబైకి ప్లస్‌‌‌‌‌‌‌‌ కానుంది. చెన్నై, బెంగళూరు లాంటి ప్లేస్‌‌‌‌‌‌‌‌ల్లో భారీ టార్గెట్స్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌ ముంబైకి అడ్వాంటేజ్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. మిగతా టీమ్స్‌‌‌‌‌‌‌‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. వరుసగా మూడో, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఆరో టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గే సత్తా ముంబైకి ఉంది. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ కీరన్‌‌‌‌‌‌‌‌ పొలార్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మెప్పిస్తే.. స్పిన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రాణిస్తే ముంబైని మరోసారి చాంపియన్‌‌‌‌‌‌‌‌గా చూడొచ్చు. 

బలాలు
రెండేళ్లకోసారి ట్రోఫీ నెగ్గుతూ వచ్చిన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌.. గత సీజన్‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌ నిలబెట్టుకొని కొత్త రికార్డు సృష్టించింది. కరోనా కారణంగా యూఏఈకి షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన 13వ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ ముందు నుంచే దుమ్మురేపింది. అంతకుముందు అరబ్‌‌‌‌‌‌‌‌గడ్డపై ఆడిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో పేలవ రికార్డు ఉన్నప్పటికీ అద్భుత పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. తిరుగులేని ఆటతో  ఐదోసారి విజేతగా నిలిచిన రోహిత్‌‌‌‌‌‌‌‌సేన తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆ జట్టు  ఎంత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. చాలా ఏళ్ల నుంచి తమ కోర్‌‌‌‌‌‌‌‌  టీమ్‌‌‌‌‌‌‌‌ను అలానే మెయింటేన్‌‌‌‌‌‌‌‌ చేయడం ముంబై సక్సెస్‌‌‌‌‌‌‌‌కు ప్రధాన కారణం. బ్యాటింగే ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ అతిపెద్ద బలం. ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, సౌతాఫ్రికన్‌‌‌‌‌‌‌‌ క్వింటన్‌‌‌‌‌‌‌‌ డికాక్‌‌‌‌‌‌‌‌ రూపంలో సాలిడ్‌‌‌‌‌‌‌‌  ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ జోడీ ఉంది. అవసరం అయితే ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ హార్డ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ క్రిస్‌‌‌‌‌‌‌‌ లిన్‌‌‌‌‌‌‌‌, ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ స్టర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ సైతం ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ చేయగలరు. కిషన్‌‌‌‌‌‌‌‌తో పాటు సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ ప్రతీ సీజన్‌‌‌‌‌‌‌‌కు ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చూపిస్తున్నారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఇద్దరూ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ డెబ్యూ చేయడమే కాకుండా తమ రాకను ఘనంగా చాటుకొని ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. పాండ్యా బ్రదర్స్‌‌‌‌‌‌‌‌.. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌, క్రునాల్‌‌‌‌‌‌‌‌, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ కీరన్‌‌‌‌‌‌‌‌ పొలార్డ్‌‌‌‌‌‌‌‌తో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ చాలా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ను వరల్డ్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఒకడైన జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా లీడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. మ్యారేజ్‌‌‌‌‌‌‌‌ కోసం బ్రేక్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న ఈ కొత్త పెళ్లికొడుకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తోనే మళ్లీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి రాబోతున్నాడు. లాస్ట్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌  అతనికి తోడుగా ఉన్నాడు. గత సీజన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌తో పాటు చాలా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో వికెట్లు రాబట్టాడు. ఆక్షన్‌‌‌‌‌‌‌‌లో కొనుగోలు చేసిన ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ కూల్టర్‌‌‌‌‌‌‌‌ నైల్‌‌‌‌‌‌‌‌ చేరికతో పేస్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌‌‌‌‌ సూపర్బ్‌‌‌‌‌‌‌‌గా మారింది.

టీమ్
ఇండియన్స్‌‌‌‌: రోహిత్‌‌‌‌ శర్మ (కెప్టెన్), హార్దిక్‌‌‌‌ పాండ్యా,  ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (కీపర్‌‌‌‌), జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా, సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌,  క్రునాల్‌‌‌‌ పాండ్యా, రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌,  సౌరభ్‌‌‌‌ తివారీ, ఆదిత్య తారె (కీపర్‌‌‌‌), అన్మోల్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌, అనుకూల్‌‌‌‌ రాయ్‌‌‌‌, అర్జున్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌, ధవళ్‌‌‌‌ కులకర్ణి, జయంత్‌‌‌‌ యాదవ్‌‌‌‌, మోసిన్‌‌‌‌ ఖాన్‌‌‌‌, పీయూష్‌‌‌‌ చావ్లా, యుధ్‌‌‌‌వీర్‌‌‌‌ సింగ్‌‌‌‌. 
ఫారినర్స్: కీరన్‌‌‌‌ పొలార్డ్‌‌‌‌, క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (కీపర్‌‌‌‌), క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌, ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌, జేమ్స్‌‌‌‌ నీషమ్‌‌‌‌, ఆడమ్‌‌‌‌ మిల్నే, మార్కో జెన్సెన్‌‌‌‌, నేథన్‌‌‌‌ కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌