
- పుణెలో ఏఎస్సై మృతి
ముంబై: ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. మహారాష్ట్ర ముంబైలోని జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఆరుగురు పోలీస్ ఆఫీసర్లు, ఆరుగురు కానిస్టేబుల్స్ కి వైరస్ సోకినట్లు అధికారులు సోమవారం మీడియాకు తెలిపారు. వీరితో కాంటాక్ట్ అయిన 48 మంది కానిస్టేబుళ్లతో పాటు ఆరుగురు అధికారులను క్వారంటైన్ కి తరలించామని, 55 ఏళ్లు పైబడిన 18 మంది పోలీసు సిబ్బందిని సెలవుపై పంపినట్లు వెల్లడించారు. వైరస్ సోకిన డీసీపీని హోం ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు. కరోనా రెడ్ జోన్ ను పర్యవేక్షిస్తున్న సందర్భంలోనే వీరందరికీ వైరస్ సోకినట్లు గుర్తించారు.
కరోనాతో ఏఎస్సై మృతి
కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ పుణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏఎస్సై చనిపోయారని జాయింట్ కమిషనర్ రవీంద్ర మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన 10 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్నాడని, ఒబెసిటీ, హైబీపీ వంటి సమస్యలున్నాయని నగర భారతి ఆస్పత్రికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం జరిపిన టెస్టుల్లో పైడోనీ కి చెందిన ఆరుగురు పోలీసులు, నాగ్పాడా పీఎస్ కు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ తో పాటు మరో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 12,974 మంది వైరస్ బారిన పడగా.. 548 మంది చనిపోయారు.