ఆరు గంటల్లో 74 ఎం.ఎల్. వర్షపాతం.. ముంబైకి ఎల్లో అలర్డ్​

ఆరు గంటల్లో 74 ఎం.ఎల్. వర్షపాతం.. ముంబైకి ఎల్లో అలర్డ్​

ముంబయి మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూన్​ 28 ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల మధ్య కేవలం ఆరు గంటల్లో 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 

రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని.. ముంబయికి ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. ఉత్తర ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.