cyber crime : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో రూ.1.27 కోట్లు కాజేసిండ్రు

cyber crime : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో రూ.1.27 కోట్లు కాజేసిండ్రు

పార్ట్ టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తిని నిండాముంచారు సైబర్ కేటుగాళ్లు.  పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు  కొనుక్కుందామనుకున్న అతడి దగ్గరి నుంచి 1.27 కోట్లు కొట్టేశారు. సెంట్రల్ ముంబైకి చెందిన ఓ వ్యక్తి( 53) ఇటీవలే తన ఇల్లును 1.27 కోట్లకు అమ్ముకున్నాడు. కొత్త ఇల్లు తీసుకుందామనే ప్లాన్ లో ఉండగా జూన్ 9న   అతడికి టెలిగ్రామ్ యాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.  హోటళ్ల పనితీరు,సినిమాల రేటింగ్స్, రివ్యూలు ఇవ్వమని అడిగింది.  ఇలా కొన్ని రోజులు ఆమె చెప్పినట్లు రేటింగ్ లు, రివ్యూలు ఇచ్చాడు ఫలితంగా అతడికి డబ్బులు వచ్చాయి. 

ఒకసారి హోటల్ కు రివ్యూ ఇవ్వమని అడిగితే ఇచ్చినందుకు అతడి ఖాతాలో 7 వేలు జమ అయ్యాయి.  ఒక సారి సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి మహిళ అతనికి లింక్ ను పంపింది.  ఈ సారి అతడికి 32 వేలు డిపాజిట్ అయ్యాయి.  అతని ఖాతాను చెక్ చేసుకోవాలని చెబితే 55 వేలు ఉన్నాయి.  అయితే టెక్నికల్ లోపం వల్ల  మళ్లీ చెల్లించాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.  దీంతో అతను ఆమెకు 55 వేలు పంపించాడు.

మే 17న ఒకసారి  ఆ మహిళ ఇచ్చిన టాస్క్ లన్నీ పూర్తిచేశాడు అతను.  ఇలా అన్ని చేశాక  ఆమె బ్యాంకు అకౌంట్ కు రూ. 48 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు.అయితే రూ.60 లక్షలు లాభం వచ్చిందని అతడిని నమ్మించింది. ఈ డబ్బులన్నీ రావాలంటే అదనంగా మరో 30 లక్షలు చెల్లించాలని అతడికి చెప్పింది. దీంతో మే 18న  పలు అకౌంట్లకు మొత్తం 76 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే డబ్బులు రాలేదు. ఎందుకు ఏమైంది అని ఆ మహిళను అడగ్గా ఆమె  మరిన్ని డబ్బులు డిమాండ్ చేసింది.  అప్పుడు కల్లు తెరుచుకున్న  అతను మహిళ చేతుల్లో మోసపోయానని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచారణలో  పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లో ని పలు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్  అయినట్లు గుర్తించారు.  మొత్తం 1.27 కోట్లు కాజేశారని చెప్పిన పోలీసులు ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు.