లాక్డౌన్పై ముంబై మేయర్ కీలక ప్రకటన 

లాక్డౌన్పై ముంబై మేయర్ కీలక ప్రకటన 

ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముంబైలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై మేయర్ కీలక ప్రకటన చేశారు. రోజువారీ కేసుల సంఖ్య 20వేల మార్కు దాటితే నగరంలో లాక్ డౌన్ విధిస్తామని మేయర్ కిషోరీ పండేకర్ స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముంబైలోని స్కూళ్లు అన్నీ ఇప్పటికే మూసివేసి ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రజారోగ్యం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లాక్ డౌన్ ను ఎవరూ కోరుకోవడం లేదన్న మేయర్.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ప్రజలంతా కరోనా మార్గదర్శకాలు పాటించాలని కోరారు.
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బీఎంసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అపార్ట్ మెంట్లలో 20శాతం మందికి కరోనా సోకితే ఆ బిల్డింగ్ను సీల్ చేయనున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రలో సోమవారం 12,160 కరోనా కేసులు నమోదుకాగా.. 11 మంది చనిపోయినట్లు ముంబై వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో 52,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం..

మళ్లీ కరోనా బారిన పడిన మాజీ కేంద్రమంత్రి 

బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు