Mumbai Rains: ముంబైలో మీ వాళ్లున్నారా..? వాళ్లకు అర్జెంట్గా ఈ విషయం చెప్పండి.. చాలా ఇంపార్టెంట్..

Mumbai Rains: ముంబైలో మీ వాళ్లున్నారా..? వాళ్లకు అర్జెంట్గా ఈ విషయం చెప్పండి.. చాలా ఇంపార్టెంట్..

ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో.. మహారాష్ట్ర నగర పాలక సంస్థ ముంబై నగరంలోని పాఠశాలలకు, కళాశాలలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించింది. ముంబైతో పాటు పాల్ఘర్, థానే, సింధూదుర్గ్ ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలతో ముంబై మహా నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఉదయం 8.30కు ముంబైలో మొదలైన భారీ వర్షాలు అంతకంతకూ పెరిగాయి. ముంబై నగరంలో గడచిన 24 గంటల్లో 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనజీవనం ఎక్కడికక్కడ తాత్కాలికంగా స్తంభించిపోయింది. పలు విమానాలు, రైళ్లు  కొన్ని ఆలస్యం కాగా, మరికొన్ని రద్దయ్యాయి. రద్దయిన విమాన ప్రయాణికులకు రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా తమ ఫ్లైట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు స్పష్టం చేసింది. 

ALSO READ | భారీవర్షాలతో పుణె మొత్తం మునిగిపోయింది..ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు

ముంబై నగరంలోని నాలుగు లేక్స్ వర్షపు నీటితో నిండిపోవడంతో జులై 29 నుంచి ఇప్పటిదాకా విధించిన 10 శాతం వాటర్ కట్ను నిలుపుదల చేస్తున్నట్లు ముంబై నగరపాలక సంస్థ ప్రకటించింది. ముంబై నగరానికి రేపు ఉదయం 8.30 వరకూ ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప ముంబై నగరవాసులు ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టొద్దని హెచ్చరించింది. విఖ్రోలి ప్రాంతంలో రైలు పట్టాలపై వరద నీరు చేరింది. విష్ణుపురి డ్యాం సామర్థ్యాన్ని మించి పొంగిపొర్లుతుండటంతో గేట్లు ఎత్తేశారు. ట్రైన్ నెంబర్ 12123 డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12125 ప్రగతి ఎక్స్ప్రెస్ రైళ్లను భారీ వర్షాల కారణంగా రైల్వే శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది.