ముంబైని సముద్రం మింగేస్తది.. డేంజర్ లో 30కోట్ల మంది

ముంబైని సముద్రం మింగేస్తది.. డేంజర్ లో 30కోట్ల మంది
  • 2050 కల్లా చాలా భాగం మునక
  • 30 కోట్ల మందిని ఖాళీ చేయించాలని హెచ్చరిక
  • అమెరికా క్లైమేట్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం

‘‘ఉప్పెన ముంచుకొస్తోంది. మహా నగరాన్ని సముద్రం మింగేయచూస్తోంది. అప్రమత్తం కాకుంటే కోట్లాది ప్రజలు సాగరంలో మునక తప్పదు. 2050 కల్లా చాలా వరకు భూమిని సముద్రం కమ్మేయబోతోంది’’’ భారత ఆర్థిక రాజధాని ముంబై మహా నగరానికి యూఎస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ సెంట్రల్ సంస్థ హెచ్చరికలివి.

మరో 30ఏళ్లలో తీరం వెంట 30 కోట్ల మంది ప్రజల్ని ఖాళీ చేయించకుంటే వారు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ బెల్ మోగించింది.

శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ సాయంతో అధునాతన రీసెర్చ్ చేసిన అమెరికా సంస్థ తన నివేదికను ‘నేచర్ కమ్యూనికేషన్స్’ అనే జర్నల్ లో ప్రచురించింది. సముద్ర ఉప్పొంగి వరదలా ముంచెత్తి ముంబై మహానగరాన్ని 2050 నాటికి చాలా వరకు మింగేయబోతోందని హెచ్చరించింది.

ఆ సమయానికల్లా తీరం వెంట నివసిస్తున్న  30 కోట్ల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతే కాపాడుకోలేమని స్సష్టం చేసింది.

గ్లోబల్ వార్మింగ్ వల్లనే..

కాలుష్యం, కార్బన ఉద్గారాల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని, దీని వల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని ఈ స్టడీ తెలిపింది. దీని వల్ల మంచు పర్వతాలు కరిగి, సముద్రాల మట్టం భారీగా పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు.

ప్రస్తుతం 20 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న తీర ప్రాంతం 2100 నాటికి పెద్ద అలల తాకిడికే మునిగే పరిస్థితి వస్తుందన్నారు. అలల రాపిడికి ఆ ప్రాంతం అంతా క్రమేపి సముద్రంలో కలిసిపోతుందని చెప్పారు.

ముంబైలో ముప్పు ఉన్న ప్రాంతాలు

ఇక భారత దేశంలో తూర్పున ఉన్న కోల్ కతా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్నారు. అలాగే సముద్ర మధ్యలో ఉన్న ద్వీపాల పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతోందని హెచ్చరించారు.

కోల్ కతాలో ముప్పు ఉన్న ప్రాంతాలు

గతంలో జరిగిన ఈ రకమైన అధ్యయనాలు చాలా ఆశావాదంతో నివేదికలు వెల్లడించాయని, వాటిలో చెప్పిన దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపారు.