
- రా. 7.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో
ముంబై: మహిళా క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తుది అంకానికి చేరుకుంది. లీగ్ దశను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన వరల్డ్ క్లాస్ బ్యాటర్లందరూ ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌లోనూ దుమ్మురేపడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బలమైన ముంబై ఇండియన్స్.. యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఆట, అందుబాటులో ఉన్న ప్లేయర్లు, స్ట్రాటజీ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.
లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు నెగ్గిన హర్మన్‌సేన తృటిలో టాప్ ప్లేస్‌ను చేజార్చుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి టాప్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే లీగ్ దశలో అనూహ్య విజయాలతో దూసుకొచ్చిన యూపీ వారియర్స్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే స్టార్లు ఈ టీమ్‌లో చాలా ఉన్నారు. కాబట్టి ఏమాత్రం చాన్స్ దొరికినా ముంబైకి షాక్ ఇవ్వాలని యూపీ ప్లాన్స్ వేస్తోంది.
హర్మన్‌పైనే భారం..
ముంబై టీమ్‌లో ఎక్స్‌పీరియెన్స్ ఆల్‌రౌండర్లకు కొదవలేదు. అయినా బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పైనే ఎక్కువగా పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. లీగ్ దశలో ముంబై మొత్తం 1119 రన్స్ చేస్తే ఇందులో మిడిలార్డర్ 464 రన్స్ చేసింది. ఇందులోనూ సగం హర్మన్ బ్యాట్ నుంచే వచ్చాయి. కాబట్టి కీలకమైన ఈ మ్యాచ్‌లో ముంబై నెగ్గాలంటే హర్మన్ మరోసారి మెరవాల్సిందే. ఆమెకు తోడుగా అమెలియా కెర్ర్, ఇసీ వాంగ్ కూడా నిలబడితే భారీ స్కోరును ఆశించొచ్చు.
టాప్ ఆర్డర్‌లో హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా, సివర్ బ్రంట్ మెరుపు ఆరంభంపైనే ముంబై విజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. లీగ్ దశలో ఆడిన ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ కావడంతో ముంబై రెండింటిలో ఓడింది. ఆల్‌రౌండర్ సైకా ఇషాక్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లోనూ మాథ్యూస్, బ్రంట్, వాంగ్, కెర్ర్ పై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్లందరూ మెరిస్తే ముంబైకి తిరుగుండదు.
మిడిల్ స్ట్రాంగ్
ముంబైతో పోలిస్తే యూపీ మిడిలార్డర్ చాలా బలంగా ఉంది. గత 8 మ్యాచ్‌ల్లో 1161 రన్స్ వస్తే, ఇందులో మిడిలార్డర్ (4 నుంచి 7 వరకు) 663 రన్స్ చేసింది. మిగతా టీమ్స్‌తో పోలిస్తే ఇదే అత్యధికం. తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేసీ హారిస్ చెరో రెండు వందలకు పైగా రన్స్ సాధించారు. ఎలిమినేటర్‌లో విజయం సాధించాలంటే ఈ ఇద్దరితో పాటు సోఫీ ఎకిల్‌స్టోన్ కూడా మెరవాల్సి ఉంది. ఒత్తిడిలో బ్యాట్‌తోనూ చెలరేగే సోఫీ బౌలింగ్‌లో కీలకం కానుంది. ఓపెనింగ్‌లో హీలీ, శ్వేత ఇచ్చే ఆరంభంపై యూపీ విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతి మ్యాచ్‌లో ఆడుతున్న ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు కిరణ్ నవ్‌గిరె, అంజలి సర్వాణీ ఏం చేస్తారో చూడాలి. బౌలింగ్‌లో సోఫీతో పాటు దీప్తి, పూర్వీషా, అంజలి రాణిస్తే ముంబైని కట్టడి చేయొచ్చు.
ఈ లీగ్‌లో ఇప్పటివరకు
11 వికెట్లకు పైగా తీసిన ముగ్గురు బౌలర్లు ముంబై టీమ్‌లో ఉండగా, యూపీ నుంచి ఒక్క ఎకిల్‌స్టోన్ మాత్రమే ఈ లిస్ట్‌లో ఉంది.
జట్లు (అంచనా) :
ముంబై: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, సివర్ బ్రంట్, అమెలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, ఇసీ వాంగ్ / చోలే ట్రయాన్, అమన్‌జ్యోత్ కౌర్, హుమేరియా ఖాజీ, జింతిమాని కాలితా, సైకా ఇషాక్.
యూపీ: అలీసా హీలీ (కెప్టెన్), శ్వేత, కిరణ్ నవ్‌గిరె, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేసీ హారిస్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎకిల్‌స్టోన్, అంజలి సర్వానీ, యషశ్రీ / రాజేశ్వరి, పూర్వీషా చోప్రా.