900 ఎలక్ట్రిక్ బస్సులకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్

900 ఎలక్ట్రిక్ బస్సులకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్

కొన్నేండ్లకు ముందు ముఖ్యమైన పట్టణాలలో డబుల్ డెక్కర్ బస్సులు ఎంతోమంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తూ.. అందుబాటులో ఉండేవి. కానీ క్రమంగా ఆ బస్సులన్నీ కనుమరుగయ్యాయి. డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్దరించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సర్కార్ కూడా ముందుకొచ్చింది. తాజాగా 900 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ‘బెస్ట్’ కంపెనీకి చెందిన 900 బస్సులను కొనుగోలు చేసి ముంబైలో తిప్పనున్నట్లు మంత్రి ఆదిత్య థాకరే ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మొదటి విడతలో 400 బస్సులను ఈ ఏడాది అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మిగిలిన బస్సులను 2023 సంవత్సరంలో అందజేస్తామన్నారు.

‘ముంబైలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్ధరించడానికి సీఎం ఉద్ధవ్ థాక్రే, నేను వ్యక్తిగతంగా ఆసక్తిగా ఉన్నాం. ‘బెస్ట్’ కంపెనీకి చెందిన 900 ఎలక్ట్రిక్ మరియు ఉద్గార రహిత బస్సులను కొనుగోలు చేస్తున్నాం. ఈ సంఖ్యను క్రమంగా 10 వేలకు పెంచుతాం. రాష్ట్రంలోని ఇతర నగరాల మునిసిపల్ కమిషనర్లు కూడా ఈ బస్సులను తమ నగరాల కోసం కేటాయించాలని అభ్యర్థిస్తున్నాను. మా సూచనను గౌరవించినందుకు బెస్ట్ ఛైర్మన్ ఆశీష్, జీఎం లోకేష్ చంద్ర జీ మరియు బెస్ట్ కమిటీకి ధన్యవాదాలు’ అని మంత్రి ట్వీట్ చేశారు.

For More News..

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం

ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి