రూ. 5 లక్షలిస్తే అక్రమ ఇల్లు కూడా సక్రమమే..

రూ. 5 లక్షలిస్తే అక్రమ ఇల్లు కూడా సక్రమమే..

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో  అక్రమనిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఈ కూల్చివేతల్లో మున్సిపల్ చైర్మన్ ప్రణీత, కమిషనర్ స్వామి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ ఇల్లు కూల్చివేయకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేసినట్లు ఓ బాధితుడు తెలిపాడు. కమిషనర్ స్వామి, చైర్మన్ భర్త శ్రీకాంత్ గౌడ్‎కు తాము ఇప్పటికే రూ. 2 లక్షలిచ్చామన్నారు. ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందని.. పెళ్లి తర్వాత మిగతా రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పినా కూడా వినిపించుకోకుండా తమ ఇల్లు కూల్చివేశారని మున్సిపల్ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. మూడు రోజుల్లో బిడ్డ పెళ్లి ఉండగా.. డబ్బులివ్వలేదనే కక్షతో ఇల్లు కూలగొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులైనందుకే తమను ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 

ఈ ఘటనపై బాధితుడు స్పందిస్తూ.. ‘మా తాతల నుంచి వచ్చిన ఇంటిని.. లోన్ ద్వారా మేం కొత్తగా తిరిగి నిర్మించుకుంటున్నాం. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకుంటుంటే.. లంచం ఇవ్వకుంటే ఇల్లు కూలుస్తామని బెదిరించారు. ఎంతోకొంత ఇచ్చినా కూడా మొత్తం ఇయ్యలేదని మా ఇల్లు కూలగొట్టారు. ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ద్వంసం అయింది. మామూలు ప్రజలకు ఒక న్యాయం.. రాజకీయ నాయకులకు ఒక న్యాయం ఉంటుందా అని బాధితుడు ప్రశ్నించాడు.

For More News..

ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

పొరపాటున అకౌంట్ లోకి రూ. 15 లక్షలు