ఢిల్లీ ఫైర్ ఆక్సిడెంట్.. మా వాళ్లు ఎక్కడ ?

ఢిల్లీ ఫైర్ ఆక్సిడెంట్.. మా వాళ్లు ఎక్కడ ?

ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తమ వాళ్లు కనిపించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. 29 మంది ఆచూకీ లేదని ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. కనిపించని వారిలో 24 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ముంద్కా మెట్రో స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 27 మంది చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. 

అయితే ఘటనా ప్రాంతంలో దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమ వాళ్లు కనిపించడం లేదని భోరును రోదిస్తున్నారు. కుమార్తె కనిపించక ఓ తల్లి, సోదరుడు కనిపించడం లేదని మరో వ్యక్తి.. ఇలా.. జాడ తెలియని వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఘటనా ప్రాంతాన్ని సీఎం కేజ్రీవాల్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మరోవైపు... ఢిల్లీ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడినవారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని. ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం : 
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..27 మంది సజీవదహనం

అగ్నిప్రమాద స్థలానికి సీఎం కేజ్రీవాల్..