టేకాఫ్ అవుతుండగా ఊడిన విమానం టైర్.. కొంచముంటే ముంబై ఎయిర్ పోర్టులో విధ్వంసమే..!

టేకాఫ్ అవుతుండగా ఊడిన విమానం టైర్.. కొంచముంటే ముంబై ఎయిర్ పోర్టులో విధ్వంసమే..!

ముంబై: స్పైస్ జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానం టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో విమానాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ చాకచక్యంగా వ్యహరించడంతో తృటిలో పెను ముప్పు తప్పింది. ఈ షాకింగ్ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం.. 2025, సెప్టెంబర్ 12న గుజరాత్‎లోని కాండ్లా నుంచి స్పైస్‌జెట్ Q400 విమానం ముంబైకి బయలుదేరింది. అయితే.. కాండ్లా ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో ఫ్లైట్ ముందు భాగంలోని టైర్ ఊడిపోయింది. ఒకే టైర్‎తో విమానం ముంబైకు వెళ్లింది. అనంతరం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే టైర్‎తో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

►ALSO READ | బాలీవుడ్‌ నటి దిశా పటాని ఇంటిపై కాల్పుల కలకలం

ఒక చక్రం ఊడిపోయినప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ సేఫ్‎గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. టేకాఫ్ సమయంలో విమానం టైర్ ఊడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.