
జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత(బీఆర్ఎస్) శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు.
బీఆర్ఎస్ కు చెందిన 7వ వార్డు కౌన్సిలర్ ఉమా వెంకటయ్య, బీజేపీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ లలిత నాగరాజు సైతం కాంగ్రెస్‌లో చేరారు. కౌన్సిలర్లు కుమ్మరి రాజు, రహీమోద్దీన్, రమేశ్,చౌహాన్, జడ్చర్ల మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం ఉన్నారు.