బీఎస్పీ ర్యాలీలో చిక్కుకున్న ఎంపీ అర్వింద్

బీఎస్పీ ర్యాలీలో చిక్కుకున్న ఎంపీ అర్వింద్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురంలో బీఎస్పీ భారీ ర్యాలీ నిర్వహించింది. అభ్యర్థి అందోజు శంకరాచారితో కలిసి బీఎస్పీ స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటుగా వెళుతున్నబీజేపీ ఎంపీ అర్వింద్ వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుంది. అదే సమయంలో అర్వింద్ తో సెల్ఫీ దిగేందుకు బీఎస్పీ కార్యకర్తలు పోటీపడ్డారు. ఎంపీ అర్వింద్ ను బీఎస్పీలోకి రావాలని కార్యకర్తలు ఆహ్వానించారు. దీంతో అర్వింద్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. 6న కౌంటింగ్ జరగనుంది. ఉపఎన్నిక బరిలో మొత్తం 47 మంది పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.