5వేల కోసం మందు తాగించి చంపిండు

5వేల కోసం మందు తాగించి చంపిండు

హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్లా మల్కాపూర్​లో జరిగిన హత్యను చేవేళ్ల పోలీసులు ఛేదించారు. రూ.5వేల కోసం మర్డర్​ చేసిన నిందితుడిని రిమాండ్​కి తరలించారు. ఏసీపీ రవీందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్​ కి బతుకుదెరువుకోసం వచ్చిన సత్తయ్య (40)కి,  అదే గ్రామానికి చెందిన ఒగ్గు శివరాజ్​అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. గత నెల 29న ఇద్దరూ కల్లు తాగారు. సత్తయ్య  దగ్గరున్న 5వేలను శివరాజ్​  కాజేయాలనున్నాడు. రాత్రి 8 గంటలప్పుడు బెల్ట్​షాపులో మందు తీసుకుని గ్రామ శివారులో తాగారు. ఆ తర్వాత తలపై బండరాయితో బాది సత్తయ్యను శివరాజ్ చంపేశాడు. సత్తయ్య జేబులో సెల్​ఫోన్​, డబ్బులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులు సమాచారంతో కేసు ఫైల్​ చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించగా సత్యయ్య, శివరాజ్​ కలిసి తిరగడం కనిపించింది. శివరాజ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకొన్నాడు.