పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్  ఆరోగ్య పరిస్థితి విషమం

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన గత మూడు వారాలుగా దుబాయ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అవయవాలు పనిచేయడం లేదని..ముషారప్ కు వెంటిలేటర్ తొలగించారని ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్లో తెలిపారు. ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. 


78 ఏళ్ల ముషారఫ్ 1999 అక్టోబర్‌లో సైనిక చర్య ద్వారా పాక్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముషారఫ్  సైన్యాధిపతిగా ఉండగానే కార్గిల్ యుద్దం జరిగింది.  1998 నుంచి 2007 దాకా పాక్ ఆర్మీ చీఫ్‌గా వ్యవ‌హ‌రించిన ముషారఫ్ .. 1999 నుంచి 2002 దాకా పాక్ ర‌క్షణ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2001 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా కొనసాగారు. 2007 నవంబర్ 3న  రాజ్యాంగాన్ని రద్దు చేశారు. దీనిపై 2016 మార్చి 31న ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ కరాచీ, ఇస్తాంబుల్ లో పెరిగాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  2016 నుంచి దుబాయ్ లోనే ఉంటున్న ముషారఫ్ అప్పటి నుంచి  పాకిస్తాన్ కు తిరిగివెళ్లలేదు.