కలర్ఫుల్ బంగార్రాజు.. అస్సలు కాంప్రమైజ్ కాలే

కలర్ఫుల్ బంగార్రాజు.. అస్సలు కాంప్రమైజ్ కాలే

‘నాగార్జునతో వర్క్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ కూల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది’ అంటున్నాడు అనూప్ రూబెన్స్. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్న ‘బంగార్రాజు’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు అనూప్. జనవరి 14న మూవీ రిలీజవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించాడు. 

‘‘మనం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల తర్వాత నాగార్జునగారి ‘బంగార్రాజు’కి మ్యూజిక్ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది. అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు. ఇదో కలర్‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌మూవీ. విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌కావడంతో పాటలన్నీ ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. బ్యాగ్రౌండ్‌‌‌‌స్కోర్ కూడా నేటివిటీకి తగ్గట్టే ఉంటుంది. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో టెక్నికల్ టీమ్‌‌‌‌అంతా ఎక్స్‌‌‌ట్రా టైమ్ వర్క్ చేసింది. క్వాలిటీ విషయంలో వన్ పర్సెంట్‌‌కూడా కాంప్రమైజ్ కాలేదు. నాగ్ సార్ ఒక పాట పాడారు. ఆ సిట్యుయేషన్‌‌కి ఆయన సింగింగ్‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా కుదిరింది. అలాగే సిద్ శ్రీరామ్ ఓ పాట పాడాడు. తన వాయిస్‌‌‌‌‌‌‌‌లో ఓ సోల్ ఉంటుంది. ఇప్పటి వరకు మూడు పాటలు రిలీజ్ చేశాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మరో మూడు సాంగ్స్ విడుదల చేస్తాం. డైరెక్టర్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌లో ఐదేళ్ల క్రితం ఉన్న మెచ్యూరిటీ ఇప్పుడు డబుల్ అయ్యింది. చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇంత తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా కంప్లీటయ్యింది. ఇక నేను ఈ సినిమాతో పాటు ‘శేఖర్’ మూవీకి కూడా వర్క్ చేస్తున్నాను. అది కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది’’.