
టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్ మారుతూ వస్తోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ పని అయిపోయిందంటూ..ఇక పాత ట్యూన్స్ మాత్రమే ఇస్తున్నాడంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అవి అలానే మాత్రం ఉండవు. ఫేడ్ అవుట్ అయి..వెంటనే ఫామ్ లోకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు.
అంతేందుకు..దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)నే చూసుకుంటే..కెరీర్ స్టార్టింగ్ నుంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ..బడా హీరోస్ చేత శభాష్ అనిపించుకున్నారు. కొంతకాలం అయ్యేసరికి..అలా వైకుంఠపురం సినిమా తో థమన్ చార్ట్ బ్లాస్టర్ ఆల్బమ్ ఇవ్వడంతో..డైరెక్టర్స్ అంత దేవి శ్రీ ని పక్కకు పెట్టేశారని టాక్ బలంగా వినిపించింది. ఇక దేవి పేరు వినిపించడం మాయమైపోయింది.
ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు.. కూడా దేవి శ్రీ ప్రసాద్ ను మరిచిపోయి చరణ్ మూవీ కోసం రెహమాన్ దగ్గరకు వెళ్లిపోయారు.డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా దేవీతోనే హిట్స్ కొట్టారు. జల్సా..జులాయి..సన్నాఫ్ సత్యమూర్తి వంటి మూవీస్ తో ప్రయాణం సాగించిన..ప్రస్తుతం థమన్ ను దగ్గరకు తీసారు. ఇలా కొంతమంది మేకర్స్ దేవిని వదులుకున్నప్పటికీ..ఎక్కడ తగ్గకుండ తన దగ్గరకు వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు కూడా సాధించాడు.
1999 తెలుగులో మంచి హిట్ కొట్టిన దేవి సినిమాకి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు దేవి శ్రీ ప్రసాద్. 19 సంవత్సరాల వయస్సులోనే వరుస సినిమాలకు సైన్ చేస్తూ బాగా బిజీ అయ్యారు దేవి. ఇక 1999 (అప్పటి నుంచి) 2024 వరకు తన 25 ఏళ్ల మ్యూజిక్ కెరీర్ ను కొనసాగిస్తూ..సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు.
25 ఏళ్లు (1999 మార్చి 12-2024 మార్చి 12) తన స్వర సంగీతంతో ఉర్రుతలు ఊగించిన దేవి శ్రీ కి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి స్పెషల్ విషెష్ అందుతున్నాయి. ఫ్యాన్స్ కూడా దేవి పాటలతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చిన దేవి శ్రీ ది ప్రత్యేక స్థానం. ఇలానే మరిన్ని సినిమాలతో ఫ్యాన్స్ కు దగ్గరవ్వాలని ఆశిస్తూ..అల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ దేవి అన్న.
The man who delivered chartbuster songs across genres and across languages ❤️?
— Geetha Arts (@GeethaArts) March 12, 2024
Team #Thandel celebrates 25 years of ROCKSTAR @ThisIsDSP ✨#Thandel will be a special album from him in this special 25th year ??@chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @GeethaArts… pic.twitter.com/VtU6hLu0DS
2018 సంవత్సరం దేవికి ప్రధానమైనది. రంగస్థలం (సౌండ్‌ట్రాక్) ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి విస్తృత గుర్తింపు మరియు ప్రశంసలను అందుకుంది. ఈ ఆల్బమ్‌లో "రంగమ్మ మంగమ్మ" మరియు " జిగేలు రాణి " వంటి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని తెలుగు పాటలు ఉన్నాయి .
ప్రస్తుతం దేవీ తో సినిమాలు చేయడానికి..ఒక్కొక్కరు ముందుకొస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా దేవీ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కుబేర చేస్తున్నాడు. చందు మొండేటి..చై కలయికలో వస్తోన్న తండేల్ మూవీ కూడా దేవి చేతికి వచ్చింది.సూర్య కంగువ,విశాల్ రత్నం కూడా దేవి చేతిలో ఉన్నాయి.
ఇక సుకుమార్, హరీష్ శంకర్ సినిమాలతో దేవి ఎప్పుడు బిజీగా ఉంటాడనేది తెలిసిందే. పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. మరిన్ని బడా ప్రాజెక్ట్స్ కి కూడా దేవి సైన్ చేసినట్లు తెలుస్తోంది.
Celebrating 25 years of ROCKSTAR @ThisIsDSP ❤️?
— Pushpa (@PushpaMovie) March 12, 2024
His music for #Pushpa2TheRule will RULE all your playlists this year ??
Grand Release Worldwide on 15th AUG 2024 ?
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @MythriOfficial @SukumarWritings @TSeries pic.twitter.com/wpr35u1BKU