Family Star Second Song: విజయ్, మృణాల్ పెళ్లి పాట..హై క్లాస్ ఫ్యామిలీ స్టార్ మీరు

Family Star Second Song: విజయ్, మృణాల్ పెళ్లి పాట..హై క్లాస్ ఫ్యామిలీ స్టార్ మీరు

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. ''

లేటెస్ట్గా ఈసినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కళ్యాణి వచ్చా వచ్చా..పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా అంటూ సాగే ఈ వెడ్డింగ్ సాంగ్ సెలబ్రేషన్స్ భళే ఆకట్టుకుంటోంది. 

కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి.. అంటూ ఉన్న లిరిక్స్ బాగున్నాయి.

గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా..మంగ్లి, కార్తీక్ ఆలపించారు. విజయ్, మృణాల్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. హుషారుగా ఉన్న ఈ మ్యారేజ్ సాంగ్‍ కూడా బాగా పాపులర్ అయ్యేలా ఉంది. ఫ్యామిలీ స్టార్ నుంచి పెళ్లి పాట అనగానే ఏదో మిడిల్ క్లాస్ లా ఉంటుందని అనుకుంటే..మరి అంబానీ ఇంట్లో పెళ్లిలా ఉంది. దీన్నీ బట్టి చూస్తే హై క్లాస్ ఫ్యామిలీ స్టార్ మీరు అనేలా ఉంది విజయ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

ఇప్పటికే ‘నందనందన’ అంటూ ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్ బాగా పాపులర్ అయింది. విజయ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ సెకండ్ సింగిల్ లో లిరిక్స్ తో పాటు వీరి డ్యాన్స్ కూడా వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. 

పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతగోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో పదేళ్లు తమ ఫ్యాన్స్ మాట్లాడుకునేలా ఫ్యామిలీ స్టార్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.

అంతేకాదు ఈ సినిమాతో విజయ్ హిట్ కొడితేనే..సినిమా కెరీర్ కు ప్రాణం పోసినంత హెల్ప్ అవుతుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి మరి. ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.