
ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తమన్(Thaman) ఒకరు. తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడం తమన్ కు అలవాటే.. మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలుపెట్టిన అతికొద్దికాలంలోనే సౌత్ స్టార్ హీరోలందరితో పని చేశాడు తమన్. ఇక తెలుగులో అయితే మనోడే టాప్. ప్రస్తుతం రిలీజ్కున్న సినిమాలలో సగం తమన్ వె అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటల విషయంలో కాస్త కాపీ కొడతారు అనే కామెంట్ ఉన్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మనోడు తోపు.
ఆ విషయంలో ఫ్యాన్స్ ను ఎలా సాటిస్ఫై చేయాలో తమన్ కు బాగా తెలుసు. అయితే.. సౌత్ లో దాదాపు అందరు స్టార్స్ తో మూవీస్ చేసిన తమన్.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట. అంతే కాదు హిందీ నుండి మంచి అవకాశాలు కూడా వస్తన్నాయట. మొదటి సినిమాగా యంగ్ హీరో వరుణ్ ధావన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడట తమన్. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన తేరి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు అట్లీ కుమార్ నిర్మాతగా, కలీస్ దర్శకుడిగా వ్యవరిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో.. వామికా గబ్బి కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫస్ట్ టైం పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు తమన్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించి.. బాలీవుడ్ లో కూడా జెండా పాతేయాలని చూస్తన్నాడు తమన్.
ఇక తమన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు, పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ వంటి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్.