కథలో నుంచి పుట్టింది కళావతి

కథలో నుంచి పుట్టింది కళావతి

 ‘సర్కారు వారి పాట’  ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. పవర్ ప్యాక్డ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ . సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు. మొత్తం షైనింగ్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూనే వుంటుంది.  మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ కూడా కంప్లీట్ అర్బన్‌‌‌‌‌‌‌‌గా వుంటుంది. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందని ముందే తెలుసు. అయితే ఎప్పుడు వచ్చినా ఫ్రెష్‌గా వుండే సౌండ్స్ వుండాలని ముందే ఫిక్సయ్యా. సాధారణంగా శంకర్ గారి సినిమాల విషయంలో ఇలా జరుగుతుంది. ట్యూన్ ఎప్పుడు ఓకే అయినా రిలీజయ్యే వరకు కొత్తగా ప్రోగ్రామ్ చేస్తూనే వుంటారు. ఈ సినిమా విషయంలో మేం అదే చేశాం.

  • ‘కళావతి’ పాటను 2020 లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో చేశాను. నేను, దర్శకుడు పరశురామ్‌‌‌‌‌‌‌‌, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ హీరోయిన్ పేరుతో పాట చేయాలని నిర్ణయించుకున్నాం. నాకు ‘సామజవరగమనా’. పరశురామ్‌‌‌‌‌‌‌‌కి ‘ఇంకేం ఇంకేం కావాలె’ లాంటి మెలోడీస్‌‌‌‌‌‌‌‌ వున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆడియెన్స్ అంచనాలతో వుంటారు. పైగా మహేష్ బాబు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్. కాబట్టి స్పెషల్‌‌‌‌‌‌‌‌గా చేయాలనుకున్నాం. కంపోజ్ చేసి రెండేళ్లు దాటిపోయింది. ఈ గ్యాప్‌లో పాటకి రోజూ ప్రాణం  పోస్తూ ఎట్టకేలకి రిలీజ్ చేశాం. మా కష్టం వృథా కాలేదు.  
  • స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోల సినిమాలపై భారీ అంచనాలుంటున్నాయి. వాటిని అందుకోవడం కోసం ఏదైనా స్పెషల్ స్కూల్ వుంటే బావుణ్ణనిపించింది. మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక బాధ్యతగా మారింది. చెవులకి మాత్రమే కాదు.. మేము కూడా కనిపించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పాటల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాక తప్పలేదు. కానీ ఇప్పుడది అలవాటుగా మారిపోయింది.  
  • ఒకేసారి ఇన్ని ప్రాజెక్ట్స్ చేయడం చాలా కష్టం. బ్రెయిన్‌‌‌‌‌‌‌‌తో పాటు పరిగెత్తాలి. అయితే ఓ మంచి విషయం ఏమిటంటే..  డిఫరెంట్ కథలతో సినిమాలొస్తున్నాయి. జానర్స్ మారడం వలన మ్యూజిక్ కూడా డిఫరెంట్ జానర్స్‌‌‌‌‌‌‌‌లో వస్తోంది.  
  • మేం ఎన్ని ట్యూన్స్ అయినా చేయడానికి రెడీగా వుంటాం. అయితే అది కథకు సరిపోతుందా లేదా అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్‌‌‌‌‌‌‌‌గా చెప్పడానికి పాట కావాలి. ఇది చాలా పెద్ద బాధ్యత. ఇప్పడు కథలో నుంచి వచ్చే పాటలే ఎక్కువ. ‘కళావతి’ పాట ఇలా కథలో నుంచి వచ్చిందే! 
  • సితార రాక్ స్టార్. సితార వీడియోలు కొన్ని మహేష్ గారికి చూపించి, పెన్నీ సాంగ్ సితారతోనే చేస్తే బావుంటుందని రిక్వెస్ట్ చేశా. నమ్రతగారితో కూడా చెప్పా. సరే అన్నారు. మేము పొద్దుటి నుంచి ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తే సితార మూడు గంటల్లో  షూటింగ్ ఫినిష్ చేసేసింది. ఫైనల్ కట్ చూసిన మహేష్ చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. 
  •  ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సినిమాకి వర్క్ చేస్తున్నా. ఒక పాట బ్యాలెన్స్ వుంది. చిరంజీవి గారి ‘గాడ్ ఫాదర్’ కూడా ఒకటే పాట బ్యాలెన్స్, విజయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న తెలుగు, తమిళ బైలింగ్వల్‌‌‌‌‌‌‌‌కి మూడు పాటలు.. బాలకృష్ణ గారి సినిమాకి ఒక పాట రికార్డ్ చేశాం. 
  • నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌పై వర్క్ చేయాలనుంది. అలాగే ఫిల్మ్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ని  ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌గా తీసుకెళ్లాలి. తెలుగు సినిమా నేడు ప్రపంచవ్యాప్తమైంది. దాంతో మ్యూజిక్ విషయంలో రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. అయితే నేను వంద కోట్ల సినిమాలు మాత్రమే చేస్తానని కొందరు అంటున్నారు. ఆ ప్రచారంలో అస్సలు నిజం లేదు. మ్యూజిక్‌‌‌‌‌‌‌‌కి స్కోప్ వుండే అన్ని సినిమాలూ చేస్తాను.
  • మంచి మ్యూజిక్ ఇవ్వడం మాత్రమే కాదు.. అంచనాలు ఒత్తిడిని భరించగలడా అనేది కూడా చూస్తున్నారు మేకర్స్. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్  అంటూ అందరూ మ్యూజిక్ తప్పొప్పులు చెబుతుంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో  పోటీ కూడా ఉంటోంది. అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వుంటే మంచిదే. 
  • ఈ ఒత్తిడి కూడా మంచి పాటని ఇవ్వడానికి ఉపయోగపడుతోంది.