ముస్లింలని.. మా దగ్గర కూరగాయాలు కొంటలేరు

ముస్లింలని.. మా దగ్గర కూరగాయాలు కొంటలేరు
  • అధికారులకు కంప్లైంట్‌ చేసిన..
  • యూపీకి చెందిన ఇద్దరు వ్యాపారులు

బండా: ముస్లింలని తమ దగ్గర ఎవరూ కూరగాయలు కొనడం లేదని ఉత్తర్‌‌ప్రదేశ్‌ మహోబాకు చెందిన ఇద్దరు వ్యాపారులు అధికారులకు మంగళవారం కంప్లైంట్‌ చేశారు. తాము కూడా తబ్లిగీ జమ్మాత్‌కు చెందిన వారిగా అపోహ పడుతున్నారని, తమ దగ్గర కూరగాయలు కొంటే కరోనా వస్తుందని తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ శనివారం ఇద్దరు ముస్లిం వ్యాపారులు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్‌ చేశారు. వాళ్ల దగ్గర ఎవరూ కూరగాయలు కొనడం లేదని, తబ్లిగ్‌కు చెందిన వాళ్లం అని గ్రామ్థులు తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు” అని అడిషనల్‌ జిల్లా కలెక్టర్‌‌ రామ్‌ సురేశ్‌ వర్మ చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించారని అన్నారు. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మనిలాల్‌ పాటిదార్‌‌ చెప్పారు. “ మండీ సమితి పాస్‌లు తీసుకుని చికారా, సుపా, సిజ్‌హరి తదితర గ్రామాల్లో కూరగాయాలు అమ్మేందుకు మిగతా వారితో కలిసి వెళ్లాం. గ్రామస్థులు మా దగ్గర కూరగాయాలు కొని ఆ తర్వాత ముస్లింలు అని తెలిసిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తున్నారు” అని మహ్మద్‌ ఇస్రార్‌‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.