రామకృష్ణాపూర్ పట్టణంలో శబరికి వెళ్తున్న అయ్యప్ప స్వాములకు ముస్లింల చేయూత

రామకృష్ణాపూర్ పట్టణంలో  శబరికి వెళ్తున్న అయ్యప్ప స్వాములకు ముస్లింల చేయూత

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​ పట్టణానికి చెందిన అయ్యప్పస్వాములకు సోమవారం ముస్లింలు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అందజేసి మతసామరస్యాన్ని చాటారు. స్థానిక విజయ గణపతి ఆలయం నుంచి ఇరుముడి ధరించి శబరియాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములకు రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ నేత అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ముస్లింలు పండ్లు, టిఫిన్స్, వాటర్​ బాటిల్స్​ అందించారు. 

ఈ సందర్భంగా అజీజ్​ మాట్లాడుతూ.. కులమతాలకు ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు బిక్షను అందిస్తున్నామన్నారు. మైనార్టీ వెల్ఫేర్​ కమిటీ సభ్యులు ఖాజా షరీప్,అంకూస్, షఫీ, మన్సూర్ అహ్మద్, మోహిత్, గౌస్, మేరాజ్, అఫ్జల్, తహర్, కాంగ్రెస్ లీడర్లు  పాల్గొన్నారు.