కుల, మత భేదాల్లేకుండా అభివృద్ధే ‘మోడీ మోడల్’

కుల, మత భేదాల్లేకుండా అభివృద్ధే ‘మోడీ మోడల్’

లక్నో: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో తాము ఎలాంటి పక్షపాతం చూపడం లేదని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కుల, మతాల భేదాల్లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నినాదమైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మంత్రానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. ‘యూపీలో ముస్లిం జనాభా 17 నుంచి 19 శాతంగా ఉంది. కానీ వెల్ఫేర్ స్కీమ్స్‌ లబ్ధిదారుల్లో ముస్లింలు మాత్రం 30-35 శాతంగా ఉన్నారు. వాళ్ల జనాభా కంటే లబ్ధిదారుల సంఖ్యే ఎక్కువగా ఉంది. అయినా మేం పక్షపాతం చూపకుండా పథకాల లబ్ధిని వారికి అందేలా చూస్తున్నాం. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిని అందరికీ చేరవేస్తున్నాం. ఇదే మోడీ మోడల్’ అని యోగి పేర్కొన్నారు.