
సంగారెడ్డి టౌన్, వెలుగు : టీడీఎస్ నిబంధనలపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. హైదరాబాద్ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని అన్ని శాఖల డీడీఓలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఉదయం సంగారెడ్డి, అందోల్ డివిజన్ల డీడీఓలకు, మధ్యాహ్నం జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ డివిజజన్ల డీడీఓలకు అవగాహన కల్పించారు.
ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్మానస్ రంజన్ మెహర మాట్లాడుతూ నిర్ణీత సమయంలో కరెక్ట్ టీడీఎస్ రిటర్న్స్సమర్పించాలన్నారు. సమస్యలు ఉంటే TDSCPC.GOV.IN వెబ్సైట్లో క్లారిఫికేషన్ పొందాలని సూచించారు. ఆదాయపు పన్ను, టీడీఎస్ నిబంధనలు, ఫైలింగ్ ఏ విధంగా చేయాలి, రిటర్న్స్ ఎప్పటిలోగా సమర్పించాలి? అనే అంశాలు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ ఆఫీసర్కవిత తదితరులు పాల్గొన్నారు.