టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలిసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి మార్కులు రాలేదని స్టూడెంట్ ఆత్మహత్య

టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలిసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి మార్కులు రాలేదని స్టూడెంట్ ఆత్మహత్య

ముస్తాబాద్, వెలుగు: టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలతో పాటు పాలిసెట్​లో మంచి మార్కులు రాలేదన్న మనస్తాపంతో ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోయింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రానికి చెందిన గూడ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూతురు స్నేహిత(15) నామాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలోని మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటీవల టెన్త్ పూర్తి చేసింది. టెన్త్ ఫలితాల్లో 581 మార్కులు సాధించింది. అయినా అనుకున్న మార్కులు రాలేదని బాధపడింది. దీంతోపాటు శనివారం విడుదలైన పాలిసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉరేసుకుంది. 

ఎంతసేపైనా డోర్లు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు, స్థానికులు కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉరేసుకొని కనిపించింది. స్థానికులు డోర్లు బద్దలు కొట్టి వెళ్లి చూడగా అప్పటికే చనిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని స్నేహిత డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్టం కోసం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు